WhatsApp lock: వాట్సాప్ లాక్ ఇక ఈజీ.. థర్డ్ పార్టీ యాప్స్ అవసరమే లేదు.. ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి

|

Mar 25, 2024 | 6:24 AM

వాట్సాప్ యాప్ ను లాక్ చేసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా మన సమాచారానికి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుంది. ఫోన్ ను ఓపెన్ చేసేటప్పుడు స్క్రీన్ లాక్ తీసినట్టుగానే దీనికీ సెట్ చేసుకోవచ్చు. వాట్సాప్ ను తెరవడానికి బయోమెట్రిక్ లేదా ఫేస్ లాక్ పెట్టుకోవచ్చు. వాట్సాప్ ను లాక్ చేసుకున్నా ఫోన్ లో కాల్స్ మాట్లాడటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

WhatsApp lock: వాట్సాప్ లాక్ ఇక ఈజీ.. థర్డ్ పార్టీ యాప్స్ అవసరమే లేదు.. ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి
Whatsapp
Follow us on

దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. ప్రతి ఒక్కరికీ కనీస అవసరంగా మారింది. చేతిలో ఫోన్ లేకపోతే ఒక్క పని కూడా పూర్తి కాని పరిస్థితి నెలకొంది. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా తమ అవసరాలను అనుగుణంగా స్మార్ట్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. ఇదే సమయంలో మన వ్యక్తి గత సమాచారమంతా ఫోన్ లోనే ఉంటోంది. బ్యాంకు ఖాతా నంబర్లు, ఏటీఎం పిన్ల వివరాలు, ఆధార్ కార్డు నంబర్లు, ఫ్యామిలీ ఫొటోలు ఇలా అన్ని వివరాలు ఫొన్లలోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో మన ఫోన్ ను ఎవరైనా దొంగిలించినా, లేకపోతే మన ఫోన్ పిన్ నంబర్ బయట వాళ్లకు తెలిసినా చాలా నష్టం కలుగుతుంది. మన వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లడం చాలా ప్రమాదకరం. అందుకే మన స్మార్ట్ ఫోన్ ను ఓపెన్ చేయడానికి పిన్ నంబర్, లేదా ఫేస్ లాక్ వంటి వాటిని పెట్టుకుంటాం. కానీ ఫోన్లోని వాట్సాప్ కు ఎలాంటి సెక్యూరిటీ ఉండదు. ఎవరికైనా మన ఫోన్ లాక్ నంబర్ తెలిస్తే ఫోన్ ఓపెన్ చేసి, మన వాట్సాప్ ను కూడా పరిశీలించే అవకాశం ఉంది. దాని ద్వారా తప్పుగా చాటింగ్ చేసే ప్రమాదమూ పొంచి ఉంది. బహిరంగ ప్రదేశాల్లో చాలామంది ఒక్కసారి కాల్ చేసుకోవాలని ఫోన్ అడుగుతారు. మనం వెంటనే లాక్ ఓపెన్ చేసి వారికి ఫోన్ ఇస్తాం. మనం అప్రమత్తంగా లేకపోతే వారు కాల్ మాట్లాడిన తర్వాత మన వాట్సాప్ ను పరిశీలించే ప్రమాదం ఉంటుంది.

సమస్యకు ఇదే పరిష్కారం..

అయితే వాట్సాప్ యాప్ ను లాక్ చేసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా మన సమాచారానికి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుంది. ఫోన్ ను ఓపెన్ చేసేటప్పుడు స్క్రీన్ లాక్ తీసినట్టుగానే దీనికీ సెట్ చేసుకోవచ్చు. వాట్సాప్ ను తెరవడానికి బయోమెట్రిక్ లేదా ఫేస్ లాక్ పెట్టుకోవచ్చు. వాట్సాప్ ను లాక్ చేసుకున్నా ఫోన్ లో కాల్స్ మాట్లాడటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన పిల్లలకు ఫోన్ పిన్ నంబర్లు చెబుతాం. అత్యవసర సమయంలో వారు ఫోన్ ను ఉపయోగించుకోవడానికి వీలుంటుంది. ఇది మంచి పద్ధతే అయినప్పటికీ వారు వాట్సాప్ ను ఓపెన్ చేసి లేనిపోని చాటింగ్ లు చేసే అవకాశం ఉంది. ఈ సమస్యలన్నింటికీ వాట్సాప్ లాక్ తో పరిష్కారం లభిస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులందరూ వాట్సాప్ ను లాక్ చేసుకోవడానికి, ఓపెన్ చేయడానికి వేలిముద్ర, ఫేస్ లాక్ ను ఉపయోగించవచ్చు. ఐఫోన్ వినియోగదారులు మాత్రం హ్యాండ్‌సెట్ లోని బిల్ట్-ఇన్ లాక్ ఫీచర్‌ను వాడుకోవాలి.

ఇవి కూడా చదవండి

వాట్సాప్ యాప్ కు స్క్రీన్ లాక్ వేసే విధానం..

  • ముందుగా వాట్సాప్ సెట్టింగ్ లో వెళ్లండి.
  • కిందికి స్క్రోల్ చేసి, ఫింగర్ ప్రింట్ లాక్‌ను నొక్కండి.
  • మీ వేలిముద్రతో లాక్‌ ఆన్ చేయండి.
  • నిర్ధారించడానికి వేలిముద్ర సెన్సార్‌ను లేదా మీ ముఖాన్ని స్కాన్ చేయండి.

స్క్రీన్ లాక్ ఆఫ్ చేసే విధానం..

  • వాట్సాప్ సెట్టింగ్ లోని వెళ్లండి.
  • బటన్, ట్యాబ్ వేలిముద్ర లాక్‌ను క్లిక్ చేయండి.
  • వేలిముద్రతో అన్‌లాక్‌ను ఆఫ్ చేయండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..