
దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనదారులు ఇప్పుడు మైలేజ్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా రోజూ బైక్‌పై ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు మార్గాలు వెతుకుతున్నారు. ఆటోమొబైల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, బైక్‌ను సరైన వేగంతో నడపడం ద్వారా గణనీయంగా పెట్రోల్ ఆదా చేయవచ్చు. సాధారణంగా ఎక్కువ శాతం మోటార్‌సైకిళ్లు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగం మధ్య నడిపితే ఉత్తమ మైలేజ్ ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ వేగంలో ఇంజిన్‌పై ఒత్తిడి తక్కువగా ఉండటంతో పాటు ఇంధన వినియోగం కూడా నియంత్రణలో ఉంటుంది. అధిక వేగంతో ముఖ్యంగా 80 కిలోమీటర్లకు పైగా బైక్ నడిపితే పెట్రోల్ వినియోగం వేగంగా పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. అదే విధంగా అకస్మాత్తుగా బ్రేకులు వేయడం, వేగంగా యాక్సిలరేట్ చేయడం కూడా మైలేజ్‌ను తగ్గిస్తాయి. స్థిరమైన వేగంతో బైక్ నడపడం ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుందని నిపుణులు సూచిస్తున్నారు. బైక్ నిర్వహణ కూడా మైలేజ్‌పై కీలక ప్రభావం చూపుతుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి