Smart Phones: మార్కెట్‌లో ఆ ప్రధాన ఫోన్స్ మధ్యే పోటీ.. దిబెస్ట్ ఫోన్ ఏదంటే..?

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్స్ వాడకం బాగా ఎక్కువైంది. గతంలో కేవలం కాల్స్ మెసేజ్‌లకు మాత్రమే వాడే ఫోన్లు క్రమేపి అధునాత ఫీచర్లతో అప్‌డేట్ అయ్యాయి. దీంతో యువత స్మార్ట్ ఫోన్ వాడకాన్ని ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్‌లో రూ.25 వేల కంటే తక్కువ ధరలో రెండు ప్రధాన ఫోన్లపై మధ్య పోటీ నెలకొంది. ఆ రెండు ఫోన్ల ఫీచర్లతో పాటు ఇతర అంశాల మధ్య ఉన్న ప్రధాన తేడాలను తెలుసుకుందాం.

Smart Phones: మార్కెట్‌లో ఆ ప్రధాన ఫోన్స్ మధ్యే పోటీ.. దిబెస్ట్ ఫోన్ ఏదంటే..?
Vivo T4 5g Vs Oppo F29 5g

Updated on: Apr 23, 2025 | 7:26 PM

ప్రముఖ కంపెనీ వివో భారతదేశంలో కొత్త టీ సిరీస్ మోడల్ వివో టీ4 5జీను ఇటీవల లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ భారీ 7300 ఎంఏహెచ్ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 7 ఎస్ జెన్-3 ప్రాసెసర్ వంటి అధునాత ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రస్తుతం ఒప్పో కంపెనీకు సంబంధించిన ఎఫ్-29 ప్రోకు గట్టి పోటీనిస్తుంది. ఈ రెండు ఫోన్ల మధ్య ఉన్న తేడాలను తెలుసుకుందాం. 

డిజైన్, డిస్‌ప్లే

వివో టీ4 5జీ ఫోన్ 7.9 ఎంఎం స్లిమ్, కేవలం 199 గ్రాముల బరువు కలిగి ఉంది. భారీ బ్యాటరీతో వచ్చిన బరువు మాత్రం తక్కువగా ఉంది. ఈ ఫోన్ వెనుక ప్యానెల్‌లో రెండు లెన్స్‌లు, ఎల్ఈడీ రింగ్ లైట్‌ సెటప్‌తో కెమెరా మాడ్యూల్‌తో ఆకట్టుకుంటుంది. ఒప్పో ఎప్ 29 ఫోన్ ప్రత్యేకమైన, మన్నికైన డిజైన్‌తో వస్తుంది. ఈ ఫోన్ మిలిటరీ-గ్రేడ్ సర్టిఫికేషన్‌తో పాటు ఐపీ రేటింగ్స్‌తో ఆకట్టుకుంటుంది. డిస్ ప్లే విషయానికొస్తే వివో టీ4 5 జీ ఫోన్ 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, 5000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.77 అంగుళాల క్వాడ్-కర్వ్డ్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. ఒప్పో ఎఫ్ 29 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది.

పనితీరు, బ్యాటరీ

వివో టీ4 5జీ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 ఎస్ జెన్-3 చిప్‌సెట్‌తో 12 జీబీ + 256 జీబీ వేరియట్‌తో ఆకట్టుకుంటుంది.  ఒప్పో ఎఫ్ 29 స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 ప్రాసెసర్‌తో రావడం వల్ల రోజువారీ పనితీరు సజావుగా ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఏఐ ఆధారిత లక్షణాల ఆకట్టుకుంటున్నాయి. ఇక బ్యాటరీ విషయానికి వచ్చే వివో టీ4 5జీ ఫోన్ 90 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 7300 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంటే ఒప్పో ఎఫ్ 29 ఫోన్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

ఇవి కూడా చదవండి

కెమెరా

కెమెరా విషయానికి వస్తే వివో టీ4 5జీ  ఫోన్ 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 882 ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరాతో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. అయితే ఒప్పో ఎఫ్ 29లో 50 ఎంపీ మెయిన్ సెన్సార్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సిస్టమ్ కూడా ఉంది. సెల్ఫీల కోసం వివో టీ4 5జీ 32 ఎంపీ కెమెరాతో వస్తుంటే ఎఫ్ 29లో 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

ధర

వివో టీ4 5జీ 8జీబీ+128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.21999గా ఉంది. అలాగే ఒప్పో ఎఫ్ 29 ఇలాంటి స్టోరేజ్ వేరియంట్ ప్రారంభ ధర రూ.23999గా ఉంది. 

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి