ఇప్పుడు మార్కెట్లో అంతా 5జీ ట్రెండ్ నడుస్తోంది. అన్ని కంపెనీల నుంచి 5జీ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. దాదాపు అన్ని ప్రధాన పట్టణాలతో పాటు టైర్ 2 నగరాలకు కూడా 5జీ సేవలు విస్తరించాయి. దీంతో అన్ని కంపెనీలు తమ ఉత్పత్తులను 5జీ వేరియంట్లో తీసుకొస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ టెక్ దిగ్గజం వివో నుంచి ఓ కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ మన దేశంలో లాంచ్ అయ్యింది. వివో టీ2 ప్రో 5జీ పేరిట ఇది మార్కెట్లోకి అడుగుపెట్టంది. దీనిలో 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ 3డీ కర్వ్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7200ఎస్ఓసీ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్ కిఅదనంగా మరో 8జీబీ వర్చువల్ ర్యామ్ అందుబాటులో ఉంటుంది. 3000ఎంఎం² ఆవిరి చాంబర్ కూలింగ్ తో వస్తుంది. ఈ ఫోన్ కి వెనుక వైపు 64ఎంపీ కెమెరా తో పాటు 2ఎంపీ సెకండరీ కెమెరా కూడా ఉంటుంది. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఏజీ గ్లాస్ బ్యాక్ ను కలిగి ఉంటుంది. 66వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4600ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది 22 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ చేయగలుగుతుంది. ఈ వివో స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఇతర ఫీచర్లు, ధర, లభ్యత గురించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..
వివో టీ2 ప్రో 5జీ న్యూ మూన్ బ్లాక్, డ్యూన్ గోల్డ్ రంగులలో వస్తుంది. దీని ధర 8జీబీ + 128జీబీ మోడల్ రూ. 23,999, 8జీబీ + 256జీబీ మోడల్ ధర రూ. 24,999 గా ఉంటుంది. ఇది సెప్టెంబర్ 29 నుంచి రాత్రి ఏడు గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ తో పాటు వివో అధికారిక వెబ్ సైట్లో అమ్మకానికి వస్తుంది.
ఫ్లాట్ రూ. ఐసీఐసీఐ బ్యాంక్,యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లతో రూ. 2000 ఫ్లాట్ తగ్గింపు ఉంటుంది. అలాగే పాత ఫోన్ ఎక్స్ చేంజ్ పై రూ. 1000 అదనపు బోనస్ ఇస్తారు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..