
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. స్టన్నింగ్ లుక్స్‌తో ఆకట్టుకునే డిజైన్‌తో ఈ ఫోన్‌ను డిజైన్ చేశారు. వివో టీ3ఎక్స్ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. టర్బో ఎనర్జీ అనే ట్యాగ్‌తో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది.
ఈ స్మార్ట్ ఫోన్‌లో కెమెరా సెటప్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సర్క్యూలర్ మోడల్‌తో డిజైన్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను అందించనున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 6000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. వివో టీ3ఎక్స్ స్మార్ట్ ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్‌తో పాటు ఆడియో బూస్టర్ సపోర్ట్‌ను అందించారు. ఏప్రిల్ 12వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుందని తెలుస్తోంది.
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 15,000గా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.58 ఇంచెస్‌తో కూడిన ఐపీఎస్ ఎల్‌సీడీ ఫుల్‌హెచ్‌డీ+ రిజల్యూషన్ స్క్రీన్‌ను అందించనున్నారు. ఇందులో 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే వివో టీ3ఎక్స్ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసేత ఈ ఫోన్‌ను రెడ్ విత్ గిల్టరీ ఫినిష్‌తో తీసుకొచ్చారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..