Zoom Focus: ఇకపై ఆన్‌లైన్‌ క్లాస్‌లు మరింత ‘ఫోకస్‌’గా వినొచ్చు.. సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన జూమ్‌..

|

Aug 13, 2021 | 7:35 AM

Zoom Focus Mode: మానవాళిని అత్యంత ప్రభావితం చేసింది కరోనా వైరస్‌. కంటికి కనిపించని ఓ వైరస్‌ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు లేని ఎన్నో అలవాట్లను ఈ మాయదారి రోగం వల్ల నేర్చుకోవాల్సి వచ్చింది. కరోనా ముందు తర్వాత అన్నట్లు..

Zoom Focus: ఇకపై ఆన్‌లైన్‌ క్లాస్‌లు మరింత ఫోకస్‌గా వినొచ్చు.. సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన జూమ్‌..
Zoom Focus Mode
Follow us on

Zoom Focus Mode: మానవాళిని అత్యంత ప్రభావితం చేసింది కరోనా వైరస్‌. కంటికి కనిపించని ఓ వైరస్‌ ప్రపంచాన్ని పూర్తిగా మార్చేసింది. అప్పటి వరకు లేని ఎన్నో అలవాట్లను ఈ మాయదారి రోగం వల్ల నేర్చుకోవాల్సి వచ్చింది. కరోనా ముందు తర్వాత అన్నట్లు జీవితాలు మారిపోయాయి. ఒకప్పుడు కేవలం కొన్ని సంస్థలకే పరిమితమైన వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కల్చర్‌ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇక ఎప్పుడూ వినని ఆన్‌లైన్‌ క్లాసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. గ్రామాల్లోని విద్యార్థులకు సైతం ఆన్‌లైన్‌ తరగతులు అనివార్యంగా మారాయి. దీంతో రకరకాల ఆన్‌లైన్‌ వీడియో కాలింగ్‌ యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయి. వీటి మధ్య కూడా తీవ్ర పోటీ నెలకొంది. దీంతో టెక్‌ సంస్థలు సైతం ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూ వినియోగదారులను ఆకట్టుకునే పనిలో పడ్డాయి.

ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ వీడియా కాలింగ్‌ యాప్‌ ‘జూమ్‌’ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. జూమ్‌ ఈ ఫీచర్‌ను ప్రత్యేకంగా విద్యార్థుల కోసమే ప్రవేశపెట్టింది. ‘ఫోకస్‌ మోడ్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా విద్యార్థులు మరింత ఫోకస్‌గా తరగతులు వినే అవకాశం లభిస్తుందని సంస్థ చెబుతోంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేస్తే.. ఎవరైతే వీడియోను హోస్ట్‌ చేస్తున్నారో (టీచర్).. వారిని మాత్రమే విద్యార్థి చూడగలరు. అంటే ఇతర విద్యార్థులను కానీ, వారు షేర్‌ చేసే వీడియోలు, ఫొటోలో కనిపించవన్నమాట. ఈ ఫీచర్‌ను హోస్ట్‌ యాక్టివేట్‌ చేయొచ్చు. ఇక టీచర్లు కూడా తమ విద్యార్థులు ఏం చేస్తున్నారు, ఎలాంటి అంశాలను షేర్‌ చేస్తున్నారనే అంశాలను చూడొచ్చు. ఇక హోస్ట్‌ ఫోకస్‌ మోడ్‌ ఫీచర్‌ను డిసేబుల్‌ చేస్తే.. విద్యార్థులు ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ డెస్క్‌టాప్‌ క్లయింట్లకు మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.

Also Read: GSLV F10: ఒకటి.. రెండు దశలు బాగానే సాగినా.. మూడోదశలో విఫలం.. ఇస్రో ప్రయోగం ఫెల్యూర్‌కు కారణాలు ఇవే..

Banking Customers: మీకు ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయా..? వాటిని క్లిక్‌ చేయకండి.. కొత్త రకం ఫిషింగ్‌ దాడి

Elon Musk: ఇకపై అంతరిక్షంలో దర్శనమివ్వనున్న ప్రకటనల బోర్డులు.. మరో అద్భుతానికి తెరతీస్తోన్న ఎలాన్‌ మస్క్‌.