Nothing phone 3: నథింగ్‌ కొత్త ఫోన్‌పై అప్పుడే మొదలైన ఊహాగానాలు.. ఫీచర్స్‌ లీక్‌..

|

Apr 01, 2024 | 5:22 PM

ఈ ఫోన్‌కు సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేకపోయినప్పటికీ.. నెట్టింట ఈఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు వైరల్‌ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నథింగ్ ఫోన్‌3 జులై నెలలో లాంచ్‌ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో క్వాల్కమ్‌ కొత్తగా లాంచ్‌ చేసిన...

Nothing phone 3: నథింగ్‌ కొత్త ఫోన్‌పై అప్పుడే మొదలైన ఊహాగానాలు.. ఫీచర్స్‌ లీక్‌..
Nothing Phone 3
Follow us on

లండన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం నథింగ్ ఇటీవలే నథింగ్‌ ఫోన్‌2ఏ పేరుతో కొత్త ఫోన్‌ లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే నథింగ్‌ నుంచి వచ్చిన ఈ రెండు ఫోన్‌లు యూజర్లను పెద్ద ఎత్తున అట్రాక్ట్ చేసింది. తక్కువ ధరలో స్టన్నింగ్ లుక్‌, అదిరిపోయే ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌లను తీసుకొచ్చారు. అయితే తాజాగా ఈ నథింగ్ నుంచి కొత్త ఫోన్‌ రానున్నట్లు తెలుస్తోంది. నథింగ్ ఫోన్‌ 3 లాంచింగ్‌కు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ ఫోన్‌కు సంబంధించిన ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేకపోయినప్పటికీ.. నెట్టింట ఈఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు వైరల్‌ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నథింగ్ ఫోన్‌3 జులై నెలలో లాంచ్‌ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో క్వాల్కమ్‌ కొత్తగా లాంచ్‌ చేసిన స్నాప్‌డ్రాగన్ 8ఎస్‌జెన్‌ 3 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ను రూ. 40,000 నుంచి రూ. 50,000 రేంజ్‌లో ఉండొచ్చని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌లో కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన కొన్ని ఫీచర్లను అందించనున్నారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 45 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4700 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారని సమాచారం. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌టీపీఓ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్‌లో ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అలాగే సెల్ఫీలు వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇవ్వనున్నారని టాక్‌. త్వరలోనే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లను అధికారికంగా ప్రకటించనున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..