Twitter: ట్విట్టర్ సేవలు భారం కానున్నాయా.. ఆ సేవల కోసం రుసుము చెల్లించాల్సిందేనా..?

|

Oct 31, 2022 | 1:00 PM

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న సామాజిక మాద్యమాల్లో ట్విట్టర్ ఒకటి. ప్రస్తుతం ట్విట్టర్ సంస్థను ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలన్ మస్క్ దక్కించుకున్న విషయం తెలిసిందే. యాజమాన్య హక్కులను..

Twitter: ట్విట్టర్ సేవలు భారం కానున్నాయా.. ఆ సేవల కోసం రుసుము చెల్లించాల్సిందేనా..?
Twitter
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న సామాజిక మాద్యమాల్లో ట్విట్టర్ ఒకటి. ప్రస్తుతం ట్విట్టర్ సంస్థను ప్రపంచ కుబేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలన్ మస్క్ దక్కించుకున్న విషయం తెలిసిందే. యాజమాన్య హక్కులను ఎలన్ మస్క్ దక్కించుకున్నప్పటి నుంచి ఆయన అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉన్నత ఉద్యోగులకు ఉద్వాసన పలికన ఆయన.. మిగతా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడంపై దృష్టిపెట్టారు. ఎలన్ మస్క్ నిర్ణయాలు ట్విట్టర్ ఉద్యోగులను ఆందోళనకు కూడా గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ట్విట్టర్ లో అనేక మార్పులను ఎలన్ మస్క్ శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ట్విటర్‌ పెయిడ్‌ వెర్షన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నెలవారీ బ్లూ టిక్‌ సహా అదనపు ఫీచర్ల సబ్‌స్క్రిప్షన్‌ ధరను 19.99 డాలర్లకు పెంచాలని ఉద్యోగులను ఎలన్ మస్క్‌ ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 4.99 డాలర్లు చెల్లిస్తే ‘ట్విటర్‌ బ్లూ’ పేరిట బ్లూటిక్‌ సహా అదనపు ఫీచర్లను అందిస్తున్నారు. ప్రకటనలు లేని ఆర్టికల్స్‌, ప్రత్యేక రంగుతో ఉండే హోంస్క్రీన్‌ ఐకాన్‌ ఈ ప్యాక్‌లో భాగంగా ఉంటాయి. ఇకపై ఈ సేవలకు 19.99 డాలర్లు వసూలు చేయాలని ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌ ఆదేశించినట్లు సమాచారం. దీంట్లో పెయిడ్ వెరిఫికేషన్‌ను కూడా జత చేసి బ్లూ టిక్‌ బ్యాడ్జ్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు కేవలం బ్లూటిక్‌ మాత్రమే కావాలనుకునేవారికి ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. తాజాగా బ్లూటిక్‌ను పెయిడ్‌ వెర్షన్‌లో భాగం చేయనుండడంతో బ్లూ టిక్‌ కోసం ప్రత్యేకంగా చెల్లించాల్సి రావొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ అనుసరిస్తున్న వెరిఫికేషన్‌ ప్రక్రియను పునఃసమీక్షిస్తున్నట్లు ఎలన్ మస్క్‌ ట్వీట్‌ చేయడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది. కంపెనీ ఆదాయంలో సగం ఈ సబ్‌స్క్రిప్షన్ల ద్వారానే సమకూర్చుకోవాలని ఎలన్ మస్క్‌ ఆలోచనగా కూడా తెలుస్తోంది.

ఈఏడాది నవంబరు మొదటి వారంలోనే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తిచేయాలని ఉద్యోగులను ఎలన్ మస్క్‌ ఆదేశించినట్లు ఓ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. లేదంటే ఉద్యోగులను సైతం తొలగిస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం చూడండి..