ట్విట్టర్ సేవలు మరోసారి నిలిచిపోయాయి. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ సేవలు శుక్రవారం సాయంత్రం ముపుతిప్పలు పెట్టాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. శనివారం ఉదయం 6.21 గంటలకు వినియోగదారుల ట్వీట్లు లోడ్ కాలేదని కంపెనీ ట్వీట్ చేసింది. ఈ సమస్య పరిష్కారంపై పని చేస్తున్నామని, త్వరలో పరిష్కరిస్తామని సంస్థ తెలిపింది.
నివేదిక ప్రకారం, శుక్రవారం సాయంత్రం 40,000 మంది వినియోగదారులు ట్విట్టర్ ప్లాట్‌ఫాం నుంచి ఎదుర్కొన్న సమస్య గురించి ఫిర్యాదు చేశారు. తాము చేసిన పోస్టులు లోడ్ కావడం లేదని గ్రహించిన వినియోగదారులు సంస్థ దృష్టికి తీసుకొచ్చారు. ఒక కొత్త ఫీచర్‌ను తీసుకువస్తున్న కారణంగానే ఇలాంటి సమస్య ఎదురైనట్లుగా తెలిపింది. అయితే, సంస్థ మాత్రం ఎలాంటి కారణం తెలుపలేదు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామంటూ హామీ మాత్రమే ఇచ్చింది. downdetector.com/status/twitter/
కొత్త ఫీచర్‌ను నాలుగు వారాల పాటు పరీక్షిస్తున్నామని, ఫలితాల ఆధారంగా ఈ ఫీచర్‌ను ప్రారంభించడం గురించి నిర్ణయం తీసుకుంటామని ట్విట్టర్ ప్రతినిధి ఒకరు చెప్పారు.
User reports indicate Twitter is having problems since 2:29 PM EDT. https://t.co/qqqwagPRpH RT if you’re also having problems #Twitterdown
— Downdetector (@downdetector) April 17, 2021