Twitter: అమెరికన్ మైక్రో-బ్లాగింగ్ సైట్, సోషల్ నెట్‌వర్కింగ్ సర్వీస్ ట్విటర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ట్విటర్ ఖాతాలకు ఇచ్చే బ్లూటిక్ మార్క్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్‌ను నిలిపివేసింది. వెరిఫికేషన్ రివ్యూ ప్రాసెస్‌లో భాగంగా బ్లూటిక్ సేవలను ట్విటర్ నిలిపివేసినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త ట్విటర్ ఖాతాల బ్లూటిక్ వెరిఫికేషన్ కోసం వచ్చే దరఖాస్తులను తీసుకోవడం లేదట. గతవారంలో పలు ఫేక్ ట్విటర్ ఖాతాలను తప్పుగా వెరిఫికేషన్ చేసి బ్లూటిక్‌ను ఇచ్చినట్లు ట్విటర్ నిర్ధారించింది. దీంతో ఈ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల కాలంలో ట్విటర్ ఖాతాల ధృవీకరణ కోసం దరఖాస్తు చేసి ఉంటే వారికి బ్లూటిక్ వెరిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ట్విటర్ ప్రతినిధి మాట్లాడుతూ.. రాబోయే కొన్ని వారాల్లో బ్లూటిక్ వెరిఫికేషన్‌కు వచ్చే దరఖాస్తులను తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. ట్విటర్ తన బ్లూటిక్ వెరిఫికేషన్ ప్రోగ్రాంను నిలిపివేయడం ఇదే మొదటిసారేమి కాదు. 2017 సంవత్సరంలో, ఈ ఏడాది మొదట్లో కూడా బ్లూటిక్ సేవలను ట్విటర్ నిలిపివేసింది. ఇప్పుడు తాజాగా ట్విటర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి తొలగిస్తూ ట్విటర్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ట్విటర్ ఇండియా హెడ్ నియమితులైన మనీష్ మహేశ్వరిని అమెరికాకు బదిలీ చేసింది. మనీష్‌ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్‌గా ట్విటర్ నియమించనున్నట్లు సమాచారం.
అయితే గత రెండు నెలల కిందట భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరి కొంతమంది నేతల ట్విటర్ ఎకౌంట్లకు బ్లూ టిక్ తీసేసింది. తరువాత వచ్చిన నిరసనల నేపధ్యంలో మళ్ళీ ఆ టిక్‌లు ఇచ్చేసింది. ఇది జరిగిన కొంతసేపటికి భారత ప్రభుత్వం ట్విటర్‌కు చివరి అల్టిమేటం జారీచేసింది. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల విషయంలో కచ్చితంగా ట్విటర్ ప్రతి స్పందించాల్సిందే అని తేల్చి చెప్పింది. నిబంధనలు పాటించి తీరాల్సిందే అని స్పష్టం చేసింది.
ట్విటర్ ప్రకారం.. బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ (బ్లూ టిక్) అంటే ఖాతా నిజమైనది. అలాగే ప్రజా ప్రయోజనం కోసం నిర్వహిస్తున్నది అని ఇచ్చే గుర్తింపు. ఈ టిక్ పొందడానికి, క్రియాశీల ట్విట్టర్ ఖాతా కలిగి ఉండటం చాలా ముఖ్యం. ప్రస్తుతం, ట్విటర్ ప్రభుత్వ సంస్థలు, బ్రాండ్లు, లాభాపేక్షలేని సంస్థలు. వార్తా సంస్థలు, జర్నలిస్టులు, వినోదం, క్రీడలు, ఇ-స్పోర్ట్స్, కార్యకర్తలు, నిర్వాహకులు, ఇతర ప్రభావకారుల యొక్క నిర్దిష్ట ఖాతాలను ధ్రువీకరించి ఈ బ్లూ టిక్ ఇస్తోంది. నిబంధనల ప్రకారం ట్విటర్ నీలిరంగు టిక్ లను తొలగించే అధికారం కలిగి ఉంటుంది. ఎవరైనా వారి హ్యాండిల్ పేరును మార్చుకుంటే లేదా వినియోగదారు తన ఖాతాను ధృవీకరించిన విధంగా ఉపయోగించకపోతే. ఈ సందర్భంలో బ్లూ టిక్ వెరిఫైడ్ బ్యాడ్జ్ ఎటువంటి నోటీసు లేకుండా తొలగించవచ్చు.