Whatsapp MicroPhone Issue: వాట్సాప్‌ మన మాటలు వింటుందన్న ట్విట్టర్ ఉద్యోగి.. నమ్మలేమంటూ మస్క్ ట్వీట్.. అసలేం జరుగుతుంది..

|

May 11, 2023 | 4:17 PM

ఈ ట్వీట్‌పై ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ స్పందించాడు. వాట్సాప్‌ను నమ్మలేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ట్విట్టర్‌కు సంబంధించిన సేవలను కూడా ట్విట్టర్‌లో ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు.

Whatsapp MicroPhone Issue: వాట్సాప్‌ మన మాటలు వింటుందన్న ట్విట్టర్ ఉద్యోగి.. నమ్మలేమంటూ మస్క్ ట్వీట్.. అసలేం జరుగుతుంది..
Whatsapp
Follow us on

వాట్సాప్ ఖాతాదారుల మొబైల్స్‌లోని మైక్రోఫోన్‌ను బ్యాక్ గ్రౌండ్‌లో ఉపయోగిస్తుందని ట్విట్టర్ ఉద్యోగి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఈ ఆరోపణలకు సంబంధించి స్క్రీన్ షాట్‌లను జత చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ స్పందించాడు. వాట్సాప్‌ను నమ్మలేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ట్విట్టర్‌కు సంబంధించిన సేవలను కూడా ట్విట్టర్‌లో ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్విట్టర్ వినియోగదారులు త్వరలో ట్విట్టర్ థ్రెడ్‌లలోని ఏదైనా సందేశానికి డీఎంల ద్వారా సమాధానం ఇచ్చే అవకాశం వస్తుంది. అంతేకాదు ‘ఏదైనా ఎమోజీతో కూడా రిప్లయ్ ఇవ్వవచ్చు. వినియోగదారులు ట్విట్టర్ ద్వారా వాయిస్ కాల్‌లు, వీడియో కాల్‌లు కూడా చేయగలుగుతారని మస్క్ పేర్కొన్నాడు. త్వరలో ట్విట్టర్ ద్వారా ప్రపంచంలో ఉన్న ఎవ్వరితోనైనా వీడియో, ఆడియో కాల్స్ చేసుకోవచ్చని వివరించాడు. అయితే ఈ సేవలు ఖాతాదారులను ఏ మాత్రం ఆకట్టుకుంటాయో? వేచి చూడాలి. 

ఇది ఇలా ఉండగా ట్విట్టర్ ఉద్యోగి ఆరోపణలపై వాట్సాప్ స్పందించింది. సదరు ట్విట్టర్ ఉద్యోగి వాడేది గూగుల్ పిక్సెల్ ఫోన్ అని ఆండ్రాయిడ్‌లో తమ గోప్యతా డాష్‌బోర్డ్‌లో సమాచారాన్ని తప్పుగా ఆపాదించే బగ్ కారణంగా సమస్య తలెత్తుతుందని పేర్కొంది. వాట్సాప్ ఈ విషయాన్ని పరిశోధించి, పరిష్కారాన్ని అందించమని గూగుల్‌ను కోరినట్లు తెలిపింది. అంతేకాదు వాట్సాప్ వినియోగదారులకు వారి మైక్రోఫోన్ సెట్టింగ్‌లపై పూర్తి నియంత్రణ ఉందని, వినియోగదారు కాల్ చేస్తున్నప్పుడు లేదా వాయిస్ నోట్ లేదా వీడియోని రికార్డ్ చేస్తున్నప్పుడు మాత్రమే మైక్‌ని యాక్సెస్ చేయగలరని పేర్కొంది. అలాగే సమస్యను పోస్ట్ చేసిన ట్విట్టర్ ఇంజినీర్‌తో టచ్‌లో ఉన్నామని, వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని ట్వీట్ ద్వారా ట్విట్టర్ స్పందించింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..