Twitter Blue Tick Price: ట్విట్టర్‌ బ్లూటిక్‌ కావాలా? భారతదేశంలో ఎంత చెల్లించాలి?

|

Nov 06, 2022 | 1:03 PM

ముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ఐఓఎస్‌ ఆధారితంగా..

Twitter Blue Tick Price: ట్విట్టర్‌ బ్లూటిక్‌ కావాలా? భారతదేశంలో ఎంత చెల్లించాలి?
Twitter Blue Tick
Follow us on

ముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ బ్లూటిక్‌ వెరిఫికేషన్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి ఐఓఎస్‌ ఆధారితంగా పనిచేసే ఫోన్లకే ఇది పరిమితమైంది. అదికూడా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, న్యూజిలాండ్‌లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది. త్వరలోనే ఈ ట్విట్టర్ బ్లూటిక్ సేవలను మిగిలిన ప్రాంతాలకు విస్తారించనున్నట్లు ట్విట్టర్‌ తెలిపింది. అయితే ఈ సేవలను పొందాలంటే నెలకు 7.99 అమెరికన్‌ డాలర్లు చెల్లించాల్సిందే. అదే భారత్‌లో అయితే రూ.469 ఉండవచ్చని తెలుస్తోంది. ట్విట్టర్‌ టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ చేతుల్లోకి వెళ్లిన తర్వాత సంస్కరణలు ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగా ఖర్చులను తగ్గించుకోవడానికి సగం మందికిపైగా ఉద్యోగులను తొలగించారు.

ఐఓఎస్ ట్విట్టర్ యాప్ కూడా భారతదేశంలో బ్లూ టిక్‌ ధర రూ.469గా చూపుతుంది. అయితే దేశంలో సభ్యత్వం ఇంకా అందుబాటులోకి రానందున, అదే సరైన ధర కాదా అనేది క్లారిటీ లేదు. యాప్ స్టోర్‌లో అప్‌డేట్ కనిపిస్తున్నప్పుడు ట్విట్టర్‌ ఉద్యోగి ఎస్తేర్ క్రాఫోర్డ్ నిన్న ట్వీట్ చేస్తూ కొత్త బ్లూ ఇంకా అందుబాటులోకి రాలేదని, ట్విట్టర్‌ బ్లూటిక్‌ ప్రారంభం కావడానికి పనులు జరుగుతున్నాయని తెలిపారు.

Twitter Blue Tick Price

ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు చెల్లింపుల ప్రాతిపదికన బ్లూటిక్‌ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది ట్విట్టర్‌. ఈ సేవలు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని సంస్థ ప్రకటించింది. ట్విట్టర్ ప్రకారం.. బ్లూ టిక్ అంటే ఖాతా నిజమైనదని, అలాగే ప్రజా ప్రయోజనం కోసం నిర్వహిస్తుందని ఇచ్చే గుర్తింపు. అయితే ఈ బ్లూటిక్‌ పొందాలంటే ట్విట్టర్‌ అకౌంట్‌ యాక్టివ్‌గా ఉండటం తప్పనిసరి. ప్రస్తుతం ట్విట్టర్ ప్రభుత్వ సంస్థలు, బ్రాండ్లు, లాభాపేక్షలేని సంస్థలు, వార్తా సంస్థలు, జర్నలిస్టులు, ఎంటర్‌టైన్‌మెంట్‌, క్రీడలు, ఇ-స్పోర్ట్స్‌ రంగాల్లో ఉన్నవారి నిర్ధిష్ట ఖాతాలను ధ్రువీకరించి ఉచితంగానే ఈ బ్లూ టిక్ ఇస్తూ వస్తోంది. తాజా నిర్ణయంతో ఈ బ్లూటిక్‌ కావాలంటే తప్పనిసరిగ్గా డబ్బులు చెల్లించాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి