TRAI: మొబైల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి ఎంఎన్‌పీ ఎస్‌ఎంఎస్‌ కోసం ఎలాంటి బ్యాలెన్స్‌ అవసరం లేదు

| Edited By: Phani CH

Dec 08, 2021 | 9:15 AM

TRAI: టెలికం రంగలో చాలా మార్పులు జరుగుతున్నాయి. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే విధంగా టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI) కీలక ఆదేశాలు..

TRAI: మొబైల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక నుంచి ఎంఎన్‌పీ ఎస్‌ఎంఎస్‌ కోసం ఎలాంటి బ్యాలెన్స్‌ అవసరం లేదు
Follow us on

TRAI: టెలికం రంగలో చాలా మార్పులు జరుగుతున్నాయి. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే విధంగా టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI) కీలక ఆదేశాలు జారీ చేసింది. టెలికం సంస్థలు మొబైల్‌ వినియోగదారులకు బ్యాలెన్స్‌తో సంబంధం లేకుండా పోర్టబిలిటీ ఎస్‌ఎంఎస్‌లకు అనుమతి ఇవ్వాలని మంగళవారం ఆదేశించించింది. మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటి (ఎంఎన్‌పీ) కోసం 1900కు ప్రీ-పెయిడ్‌ కస్టమర్‌ ఎస్‌ఎంఎస్‌ పంపించాలనుకుంటే మొబైల్‌లో సరిపడా బ్యాలెన్స్‌ లేకపోయినట్లయితే టెలికం సంస్థలు ఎస్‌ఎంఎస్‌ను తిరస్కరిస్తున్నాయి. మొబైల్‌ బ్యాలెన్స్‌ ఉంటేనే ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. అయితే ఇందుకు సంబంధించి ఇటీవల కాలంలో తమకు అధిక మొత్తంలో మొబైల్‌ కస్టమర్ల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని ట్రాయ్‌ పేర్కొంది.

ఇక కస్టమర్‌ ప్లాన్‌ లేదా వోచర్‌లో బ్యాలెన్స్‌ ఉన్నా.. లేకున్నా.. ఎంఎన్‌పీకి టెలికం ఆపరేటర్లు సహకరించాల్సిందేనని ట్రాయ్‌ స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని కూడా తెలిపింది. ప్రీ-పెయిడ్‌ కస్టమర్‌ కావచ్చు. పోర్ట్‌ ఔట్‌ ఎస్‌ఎంఎస్‌ సెండింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని తెలిపింది. అయితే ఇటీవల ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో తమ ప్లాన్స్‌ ధరలను పెంచడంతో చాలా మంది కస్టమర్లు నెట్‌వర్క్‌ను మారేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Reliance Jio: జియో యూజర్లకు మరో షాక్‌.. ఆ ప్లాన్‌ ధరలను కూడా పెంచేసింది..!

Credit, Debit Cards: మీ క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డును లాక్‌ చేసుకోవడం ఎలా..? కార్డును ఎలా సెట్‌ చేసుకోవాలి..!