Whatsapp Update: వాట్సాప్ గ్రూప్స్‌లో యాడ్ చేస్తూ విసిగిస్తున్నారా..? ఈ టిప్స్‌తో ఆ సమస్య ఫసక్..!

|

Aug 02, 2024 | 7:37 PM

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వివిధ యాప్స్ వినియోగాన్ని బాగా ఇష్టపడుతున్నారు. అయితే అందరి ఫోన్స్‌లో వాట్సాప్ అనేది తప్పనిసరి యాప్‌గా ఉంటుంది. వాట్సాప్ అనేది  ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు ఉపయోగించే అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ అని నిపుణులు చెబుతున్నారు. వాట్సాప్‌లో చాటింగ్‌తో పాటు, వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, స్టేటస్‌లను ఇతరులతో పంచుకోవచ్చు.

Whatsapp Update: వాట్సాప్ గ్రూప్స్‌లో యాడ్ చేస్తూ విసిగిస్తున్నారా..? ఈ టిప్స్‌తో ఆ సమస్య ఫసక్..!
New Feature In Whatsapp
Follow us on

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులు వివిధ యాప్స్ వినియోగాన్ని బాగా ఇష్టపడుతున్నారు. అయితే అందరి ఫోన్స్‌లో వాట్సాప్ అనేది తప్పనిసరి యాప్‌గా ఉంటుంది. వాట్సాప్ అనేది  ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు ఉపయోగించే అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ అని నిపుణులు చెబుతున్నారు. వాట్సాప్‌లో చాటింగ్‌తో పాటు, వినియోగదారులు ఫోటోలు, వీడియోలు, స్టేటస్‌లను ఇతరులతో పంచుకోవచ్చు. అయితే వాట్సాప్ గ్రూప్స్ ఇటీవల యూజర్లు ఎక్కువగా వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇతరులు మనల్ని గ్రూపుల్లో యాడ్ చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఇటీవల కాలంలో చాలా మంది వినియోగదారులకు మెసేజ్‌లను పంపడానికి  వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మొబైల్ నంబర్‌లు సులభంగా అందుబాటులో ఉన్నందున చాలా వ్యాపారాలు, స్కామర్‌లు తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి లేదా వ్యక్తులను మోసం చేయడానికి వాట్సాప్ గ్రూప్‌లను క్రియేట్ చేస్తున్నారు. అయితే మనకు తెలియకుండానే మనల్ని గ్రూపులో యాడ్ చేయడం వల్ల చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. దీన్ని పరిష్కరించడానికి, వాట్సాప్ ఒక ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది వినియోగదారులను గ్రూప్‌లకు ఎవర్ని యాడ్ చేయాలో? ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ముఖ్యంగా యూజర్లు ఆల్ లేదా మై కాంటాక్ట్స్ ఆప్షన్ ద్వారా దీన్ని సెట్ చేసుకోవచ్చు. 

వాట్సాప్ గ్రూపు సెట్టింగ్స్ ఇలా

  • ముందుగా వాట్సాప్ హోమ్ పేజీకి వెళ్లి కుడి వైపు పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. 
  • అక్కడ డ్రాప్-డౌన్ మెనూ నుంచి ‘సెట్టింగ్‌లు’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 
  • అక్కడ ‘గ్రూప్స్’ను కిందకుక స్క్రోల్ చేయాలి. అక్కడ హూ కెన్ యాడ్ గ్రూప్స్ ఆప్షన్ ఎంచుకుని, ఆల్ నుంచి మై కాంటాక్స్‌ను ఎంచుకోవాలి.  ఇలా చేయడం ద్వారా మన ఫోన్‌లో సేవ్ చేసిన కాంటాక్ట్స్ మాత్రమే మనల్ని వాట్సాప్ గ్రూపులో యాడ్ చేయగలరు. మనకు తెలియని వివిధ గ్రూపుల్లో యాడ్ చేసే అవకాశం ఉండదు. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి