టిక్‌టాక్‌ మాతృసంస్థ నుంచి త్వరలో స్మార్ట్‌ఫోన్లు!

టిక్..టాక్ ప్రస్తుతం ఈ యాప్ పేరు తెలియని వారు ఉండరు. దీన్ని చైనాకు చెందిన సోషల్ మీడియా సంస్థ బైట్ డ్యాన్స్‌ ప్రవేశపెట్టింది. త్వరలో వీరు  స్మార్ట్‌ఫోన్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. దానికోసం స్మార్ట్‌జాన్‌ టెక్నాలజీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్రస్తుతం వీడియో, యాప్స్‌లో దూసుకెళ్తోన్న ఈ సంస్థ కొత్త రంగంలోకి అడుగుపెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. దీనిలో భాగంగా బైట్ డ్యాన్స్‌ ప్రతినిధి కంపెనీ భవిషత్తు ప్రణాళికపై మాట్లాడారు. ‘ఇది స్మార్ట్‌జాన్ […]

టిక్‌టాక్‌ మాతృసంస్థ నుంచి త్వరలో స్మార్ట్‌ఫోన్లు!
Ram Naramaneni

|

Jul 30, 2019 | 4:45 AM

టిక్..టాక్ ప్రస్తుతం ఈ యాప్ పేరు తెలియని వారు ఉండరు. దీన్ని చైనాకు చెందిన సోషల్ మీడియా సంస్థ బైట్ డ్యాన్స్‌ ప్రవేశపెట్టింది. త్వరలో వీరు  స్మార్ట్‌ఫోన్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. దానికోసం స్మార్ట్‌జాన్‌ టెక్నాలజీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ప్రస్తుతం వీడియో, యాప్స్‌లో దూసుకెళ్తోన్న ఈ సంస్థ కొత్త రంగంలోకి అడుగుపెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. దీనిలో భాగంగా బైట్ డ్యాన్స్‌ ప్రతినిధి కంపెనీ భవిషత్తు ప్రణాళికపై మాట్లాడారు.

‘ఇది స్మార్ట్‌జాన్ ప్రణాళికలకు కొనసాగింపు. పాతతరం స్మార్ట్‌జాన్ యూజర్ల అవసరాలే లక్ష్యంగా ముందుకెళ్లనున్నాం’ అని తెలిపారు. సాంకేతిక రంగంలో ప్రముఖ కంపెనీగా ఎదిగిన బైట్ డ్యాన్స్‌ ఇప్పటికే స్మార్ట్‌జాన్‌కు చెందిన కొన్ని పేటెంట్లను చేజిక్కించుకుంది. అలాగే స్మార్ట్‌జాన్‌ ఉద్యోగులు కొందరు బైట్‌డ్యాన్స్‌కు బదిలీ అయ్యారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu