వాట్సాప్ అప్డేట్ చేసుకోకపోతే.. నష్టాలేంటి?

|

May 14, 2019 | 5:06 PM

మెసేజెస్ సెండ్ అవుతున్నాయి.. రిసీవ్ అవుతున్నాయి.. హాయ్-బాయ్ లన్నీ చకచకా జరిగిపోతున్నాయి.. ఇంకేంటి? అనుకుని వాట్సాప్ ని నిర్లక్ష్య పరుస్తున్నామా? అయితే మనం తీవ్రంగా నష్టపోతున్నట్లే లెక్క. వాట్సాప్ అప్డేట్ చేసుకోకపోవడం అనే చిన్నపాటి అలక్ష్యం వల్ల జరిగే నష్టాలు ఒకటి కాదు రెండు కాదు అంటూ లెక్కకట్టి చెప్పిందో టెక్ వెబ్ సైట్. ఇప్పటికిప్పుడు వాట్సాప్ అప్డేట్ చేసుకోకపోతే పెను నష్టం ఏమిటి? వాట్సాప్ ద్వారా ఒక స్పైవేర్ మన కళ్ళలోకి ఇంజెక్ట్ అయ్యే ప్రమాదముందన్నది […]

వాట్సాప్ అప్డేట్ చేసుకోకపోతే.. నష్టాలేంటి?
Follow us on

మెసేజెస్ సెండ్ అవుతున్నాయి.. రిసీవ్ అవుతున్నాయి.. హాయ్-బాయ్ లన్నీ చకచకా జరిగిపోతున్నాయి.. ఇంకేంటి? అనుకుని వాట్సాప్ ని నిర్లక్ష్య పరుస్తున్నామా? అయితే మనం తీవ్రంగా నష్టపోతున్నట్లే లెక్క. వాట్సాప్ అప్డేట్ చేసుకోకపోవడం అనే చిన్నపాటి అలక్ష్యం వల్ల జరిగే నష్టాలు ఒకటి కాదు రెండు కాదు అంటూ లెక్కకట్టి చెప్పిందో టెక్ వెబ్ సైట్. ఇప్పటికిప్పుడు వాట్సాప్ అప్డేట్ చేసుకోకపోతే పెను నష్టం ఏమిటి?

వాట్సాప్ ద్వారా ఒక స్పైవేర్ మన కళ్ళలోకి ఇంజెక్ట్ అయ్యే ప్రమాదముందన్నది బ్రేకింగ్ న్యూస్. వాట్సాప్ కాల్స్ మీద టాపింగ్ జరిగేలా ఒక డేంజరస్ మాల్వేర్‌ని ఇన్‌స్టాల్ చేసిందట ఇజ్రాయిల్ బేస్డ్ NSO కంపెనీ. యూజర్ నంబర్‌కి ఫోన్ చేయడం ద్వారా.. హానికరమైన కోడ్‌ని ఫోన్‌కి ట్రాన్స్‌మిట్ చేస్తారని.. కాల్‌ని ఆన్సర్ చేయకపోయినా ఆ కోడ్ యూజర్ డివైస్‌కి చేరిపోతుందని పసిగట్టారు. కాల్ లాగ్స్‌లోంచి ఆ నంబర్ ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుందని, ఈ బెడద యాండ్రాయిడ్ ఫోన్లతో పాటు, ఐఫోన్లకు కూడా తగిలే ఛాన్సుందని హెచ్చరిస్తున్నారు.

ఈ సీక్రెట్ స్పైవేర్‌కి ఎంతమంది యూజర్లు గురయ్యారన్న లెక్క తమ దగ్గర లేదంటోంది వాట్సాప్ సంస్థ. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల మంది యూజర్లున్న వాట్సాప్‌కి ఈ లెక్క తేల్చడం కష్టమే కావొచ్చు. కానీ.. ఈ లూప్‌హోల్‌ని ఫిక్స్ చేసి పరిష్కారమైతే కనిపెట్టారు వాట్సాప్ డెవలపర్లు. ఈ సోమవారమే ఈ అప్డేట్ జారీ అయింది. అందుకే.. వెంటనే వాట్సాప్ అప్డేట్ చేసుకోకపోతే.. యూజర్లు ఎవరైనా ఈ మాల్వేర్ బారిన పడిపోవడం ఖాయం. తర్వాత మన ఫోన్ కాల్స్ టాప్ అయ్యాయి మొర్రో అంటూ ఏడ్చుకున్నా లాభం లేదు.