Dangerous Apps: అలర్ట్.. అలర్ట్.. మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే యాప్స్ ఇవే.. మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి..

| Edited By: Srinu

Feb 15, 2023 | 4:16 PM

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల డేటాను దొంగిలిస్తున్న 203 హానికరమైన యాప్ లను థాయ్ ల్యాండ్ కి చెందిన డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ, నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కొనుగొంది.

Dangerous Apps: అలర్ట్.. అలర్ట్.. మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే యాప్స్ ఇవే.. మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి..
Dangerous Apps
Follow us on

అరచేతిలోకి ప్రపంచాన్ని తెచ్చిట్టిన సాధనం స్మార్ట్ ఫోన్.. ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. దీనిలో అనేక రకాల ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. దానికి బదులు మన స్మార్ట్ ఫోన్ ను మరింత స్మార్ట్ గా మార్చేందుకు అనేక రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్ లో ఇలాంటి యాప్ వేలల్లో మనకు దర్శనమిస్తాయి. సోషల్ మీడియా యాప్‌లు, పేమెంట్ యాప్‌లు, ఎడిటింగ్ యాప్‌లు ఇలా చాలా యాప్ లు గూగుల్ ప్లే స్టోర్లో ఫ్రీగా లభ్యమవుతాయి. అయితే, వీటిలో కొన్ని యాప్‌లు ప్రమాదకరమైనవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన వెంటనే హ్యాకర్లు ఫోన్‌ను క్యాప్చర్ చేసి, ఆ వ్యక్తి గత సమాచారాన్ని దొంగిలిస్తాయని వివరిస్తున్నారు. ఈ రకంగా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల డేటాను దొంగిలిస్తున్న 203 హానికరమైన యాప్ లను థాయ్ ల్యాండ్ కి చెందిన డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ, నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కొనుగొంది. ఈ యాప్ లు వినియోగదారుల డాటాను దొంగిలించడానికి స్మార్ట్ ఫోన్లను లక్ష్యంగా చేసుకునే మాల్ వేర్ ని కలిగి ఉన్నట్లు నిర్ధారించాయి.

మీ ఫోన్ లో ఉంటే తొలగించండి..

ఈ యాప్స్ లో చాలా వరకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించినప్పటికీ, ఒకవేళ మీరు మీ స్మార్ట్ ఫోన్ లో ఇప్పటికే ఈ యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకుని వినియోగిస్తున్నట్లైతే, వెంటనే వాటిని తొలగించాలని నిపుణులు చెబుతున్నారు. థాయ్ ల్యాండ్ సంస్థ ప్రకటించిన జాబితాను మీకోసం కింద ఇస్తున్నాం. వీటిలో ఏదైనా యాప్ మీ స్మార్ట్ ఫోన్ లో ఇన్స్టాల్ అయ్యి ఉంటే వాటిని వెంటనే డిలీట్ చేసేయండి..

ఆ యాప్స్ ఇవే..

4కే ప్రో కెమెరా, 4కే వాల్ పేపర్స్ ఆటో ఛార్జర్, అడ్వాన్స్డ్ ఎస్ఎంఎస్, ఐపిక్ – మ్యాజిక్ ఫోటో ఎడిటర్, అల్ గుడ్ పీడీఎఫ్ స్కానర్, అల్ గుడ్ లాంగ్వేజ్ ట్రాన్స్ లేట్, టోటల్ ఫోటో ట్రాన్స్ లేటర్, ఆర్ట్ ఫిల్టర్స్, ఆస్ట్రో + హోరోస్కోప్, ఆస్ట్రోలైన్: డైలీ హోరోస్కోప్, ఆటో స్టిక్కర్ మేకర్ స్టూడియో, అవతార్ మేకర్ క్యారెక్టర్ క్రియేటర్, బేబీ స్టిక్కర్ – ట్రాక్ మైల్ స్టోన్స్, బాస్ బూస్టర్ వాల్యూమ్ పవర్ యాంప్, బ్యాటరీ ఛార్జింగ్ యానిమేషన్స్ బ్యాటరీ వాల్ పేపర్, బ్యాటరీ ఛార్జింగ్ యానిమేషన్స్ బబుల్ – ఎఫెక్ట్స్, బీట్.ఎల్ వై మ్యూజిక్ వీడియో మేకర్, బీట్ మేకర్ ప్రో, బ్యూటీ ఫిల్టర్, బ్లడ్ ప్రెషర్ చెక్, బ్లడ్ ప్రెషర్ డైరీ, బ్లూ స్కానర్, బ్లర్ ఇమేజ్, కాలర్ థీమ్, కాల్ మీ ఫోన్ థీమ్స్, కాల్ స్కిన్స్, కెమెరా ట్రాన్స్ లేటర్, కేర్ మెస్సేజ్, కార్టూన్స్ మీ, క్యాచీ క్లియర్, చాట్ ఆన్ లైన్, చాట్ ఎస్ఎంఎస్, చాట్ టెక్ట్స్ ఎస్ఎంఎస్, క్లాసిక్ ఎమోజీ కీబోర్డ్, క్లాసిక్ గేమ్ మెసెంజర్, కోకో కెమెరా v1:1, కమ్ మెస్సేజెస్, కాంటాక్ట్ బ్యాక్ గ్రౌండ్.

ఇవి కూడా చదవండి

కూల్ కీబోర్డ్, కూల్ మెస్సేజెస్, క్రియేటివ్ 3డీ లాంచర్, క్రియేటివ్ ఎమోజీ కీబోర్డ్, కస్టమ్ థీమ్స్ కీబోర్డ్, కట్ పేస్ట్, డాజ్ క్యామ్- డీ3డీ ఫోటో ఎఫెక్ట్, డాజిల్ – ఇన్స్టా స్టోరీస్ ఎడిటర్, డాజ్లింగ్ కీబోర్డు, డిజైన్ మేకర్, డిజైర్ ట్రాన్స్లేట్, డైరెక్ట్ మెసెంజర్, డిజ్జి, టీజ్ ఇట్!, డ్రింక్ వాటర్, డ్రమ్స్: ప్లే బీట్స్ & డ్రమ్, గేమ్స్, ఈజీ పీడీఎఫ్ స్కానర్, ఎడ్జింగ్ మిక్స్, ఎడ్జింగ్ ప్రో, ఎమోజీ వన్ కీబోర్డు, ఎమోజీ థీమ్ కీబోర్డ్, ఈక్వలైజర్ + హెచ్ డి మ్యూజిక్ ప్లేయర్, ఈక్వలైజర్ ఎఫ్ఎక్స్: బాస్ బూస్టర్ యాప్, ఫాంట్స్ ఎమోజీ కీబోర్డ్, సర్కిల్, ఫ్రేమ్స్, ఫ్రీగ్లో కెమెరా 1.0.0, ఫన్నీ కాలర్, ఫన్నీ కెమెరా.

ఫన్నీ ఎమోజీ మెస్సేజ్, ఫన్నీ కీబోర్డు, ఫన్నీ వాల్ పేపర్లు – లైవ్ స్క్రీన్, జిఫ్ ఎమోజీ కీబోర్డ్, గర్ల్ గేమ్స్: యూనికార్న్ స్లీమ్, గిటార్ ప్లే – గేమ్స్ & సాంగ్స్, గిటార్ – రియల్ గేమ్స్ & లెసన్స్, గిటార్ ట్యూనర్ – ఉకులేలే & బాస్, హాలోవీన్ కలరింగ్, హ్యాండ్ సెట్ – సెకండ్ ఫోటో నెంబరు, హార్ట్ ఎమోజీ స్టిక్కర్స్, హైలైట్ స్టోరీ కవర్ మేకర్!, హాయ్ టెక్స్ట్ ఎస్ఎంఎస్, హోరోస్కోప్ 2019 అండ్ పామ్ రీడర్, హబ్ – స్టోరీ టెంప్లేట్స్ మేకర్, హమ్మింగ్ బర్డ్ పీడీఎఫ్ కన్వర్టర్ – ఫోటో టూ పీడీఎఫ్, హైపర్ క్లీనర్: క్లీన్ ఫోన్, ఐకాన్స్ – ఐకాన్ ఛేంజర్ యాప్, ఐమెసెంజర్, ఇంప్రెస్సో, ఇన్స్టంట్ మెసెంజర్, ఐ విడ్జెట్ ప్రో, జాంబ్ల్: డీజే బ్యాండ్, బీట్ మేకర్, జిగ్సా పజిల్

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..