AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Lookup Feature: రాంగ్ కాల్స్ ఇక రమ్మన్నా రావు.. ఈ లుకప్ ఫీచర్‌పై ఓ లుక్కేయండి..

అన్‌నోన్ కాల్స్ సమస్యను పరిష్కరించడానికి గూగుల్ చర్యలు చేపట్టింది. దీనికోసం లుకప్ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. అన్ నోన్ (తెలియని) కాలర్లను గుర్తించడంలో ఇది సహాయ పడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ గూగుల్ పిక్సెల్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. దీని ద్వారా యాప్ మారకుండానే కాలర్ సమాచారం తెలుసుకునే వీలుంటుంది.

Google Lookup Feature: రాంగ్ కాల్స్ ఇక రమ్మన్నా రావు.. ఈ లుకప్ ఫీచర్‌పై ఓ లుక్కేయండి..
Google Pixel
Madhu
|

Updated on: Jun 17, 2024 | 6:04 PM

Share

మన ఫోన్‌కు నిరంతరం అనేక కాల్స్ వస్తుంటాయి. వాటినన్నింటికీ మనం సమాధానాలు చెబుతూ ఉంటాం. ఫోన్ చేసిన వారిలో స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు, కోలిగ్స్ ఉంటారు. అయితే కొన్నిసార్లు తెలియని నంబర్ల నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి. ఆ సమయంలో మనం ముఖ్యమైన పనిలో ఉంటాం. హడావుడిగా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితే అది ఏ వ్యాపార సంస్థతో కావచ్చు. దీనివల్ల మనకు చిరాకు అనిపిస్తుంది.

లుకప్ ఫీచర్..

అన్‌నోన్ కాల్స్ సమస్యను పరిష్కరించడానికి గూగుల్ చర్యలు చేపట్టింది. దీనికోసం లుకప్ అనే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. అన్ నోన్ (తెలియని) కాలర్లను గుర్తించడంలో ఇది సహాయ పడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ గూగుల్ పిక్సెల్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. దీని ద్వారా యాప్ మారకుండానే కాలర్ సమాచారం తెలుసుకునే వీలుంటుంది.

మరింత సౌలభ్యం..

పిక్సెల్ ఫోన్ వినియోగించేవారు అన్‌నోన్ కాల్స్‌ను గుర్తించడం చాలా తేలికైంది. గూగుల్ విడుదల చేసిన లుకప్ ఫీచర్ తో వారికి మరింత సౌలభ్యం లభించింది. అన్ నోన్ కాల్స్ కు సమాచారం ఇవ్వాలా, వద్దా అనే విషయాన్ని వారు సులువుగా నిర్ణయించుకోవచ్చు.

ఎలా పనిచేస్తుందంటే..

లుకప్ ఫీచర్ ద్వారా తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించవచ్చు. దీనిని గతంలో జపాన్‌లో విడుదల చేశారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ పిక్సెల్ ఫోన్ల వినియోగదారులకు అందుబాటులో తీసుకువస్తున్నారు. మన కాంటాక్ట్స్‌లో సేవ్ చేయని నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు జాబితాలో కనిపిస్తుంది. దానిని నొక్కగానే సాధారణంగా యాడ్ నంబర్, మెసేజ్, హిస్టరీ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. గూగుల్ కొత్త‌గా తీసుకువచ్చిన ఫీచర్ తో వీటితో పాటు నాలుగో ఆప్షన్ గా లుకప్ అని కనిపిస్తుంది. దాన్ని నొక్కగానే ఆ నంబర్ ఎవరి పేరు మీద ఉందో కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాంకులు తదితర వాణిజ్య సంస్థల నుంచి వచ్చే కాల్స్ ను గుర్తించే అవకాశం ఉంటుంది.

అదనపు యాప్ అవసరం లేదు..

గతంలో అన్ నోన్ కాల్స్ ను గుర్తించాలంటే వేరే యాప్ ను ఉపయోగించాల్సి వచ్చేది. అప్పుడే తెలియని నంబర్ వివరాలను గుర్తించే అవకాశం ఉండేది. గూగుల్ పిక్సెల్ ఫోన్లలో వచ్చిన కొత్త ఫీచర్ అదనపు యాప్ అవసరాన్ని తొలగిస్తుంది. అన్ లోన్ కాల్స్ వివరాలను వెంటనే గుర్తించే అవకాశం ఉండడంతో మీ విలువైన సమయం ఆదా అవుతుంది. వాటికి సమాధానం ఇవ్వాలో, లేదో నిర్ణయించుకునే వీలుంటుంది. ఆ నంబర్ ను ట్యాబ్ (నొక్కడం) చేయడం ద్వారా ఆ కాల్‌కు సమాధానం ఇవ్వాలా, లేదా బ్లాక్ చేయాలా అనేది నిర్ణయం తీసుకోవచ్చు.

సర్వర్ సైడ్ అప్ డేట్..

గూగుల్ తీసుకువచ్చిన లుకప్ ఫీచర్ కు ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే ఇది సర్వర్ సైడ్ అప్ డేట్. అంటే ఫోన్ యాప్ కు సంబంధించిన కొత్త వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకునే అవసరం ఉండదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us