Wall projectors: ఇక ఇంట్లోనే థియేటర్.. 70ఎంఎం అనుభూతి కోసం బెస్ట్ 4K ప్రొజెక్టర్లు ఇవే..

ఇంట్లోనే సినిమా థియేటర్ ఎక్స్ పీరియన్స్ పొందడానికి అందరూ మొగ్గుచూపుతున్నారు. అందుకోసం ఏకంగా ప్రొజెక్టర్ ను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రొజెక్టర్ల మార్కెట్ గణనీయంగా పెరిగింది.

Wall projectors: ఇక ఇంట్లోనే థియేటర్.. 70ఎంఎం అనుభూతి కోసం బెస్ట్ 4K ప్రొజెక్టర్లు ఇవే..
Projector At Home

Updated on: Feb 20, 2023 | 4:03 PM

కరోనా తర్వాత ప్రజల ఎంటర్ టైన్మెంట్ అవసరాలు మారిపోయాయి. సినిమా థియేటర్లలో ఎప్పుడు రిలీజవుతుంది అనే దగ్గర నుంచి ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అనే పరిస్థితి వచ్చింది. ఇంట్లో నుంచే సినిమాలు చూడటం ఎక్కువైంది. అందుకే ఇంట్లోనే సినిమా థియేటర్ ఎక్స్ పీరియన్స్ పొందడానికి అందరూ మొగ్గుచూపుతున్నారు. అందుకోసం ఏకంగా ప్రొజెక్టర్ ను కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రొజెక్టర్ల మార్కెట్ గణనీయంగా పెరిగింది. గ్లోబల్ పోర్టబుల్ ప్రొజెక్టర్ మార్కెట్ విలువ 2021లో 15.64 బిలయన్ డాలర్లుగా ఉంది. ఇది 2028 నాటికి 21.72 బిలియన్లకు చేరుతుందని అంచనావేస్తున్నారు. మన భారతదేశంలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ 4కే ప్రొజెక్టర్లు గురించి ఇప్పడు తెలుసుకుందాం.

XGIMI ఆరా అల్ట్రా షార్ట్ త్రో 4కే ప్రొజెక్టర్.. ఈ ప్రొజెక్టర్ 3840 x 2160-పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 150 అంగుళాల స్క్రీన్ పరిమాణంపై 4K చిత్రాలను ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది ఎనిమిది పాయింట్ల కీస్టోన్ కరెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇది మీ గోడలు లేదా స్క్రీన్‌కు అనుకూలం అయ్యేలా నిలువుగా, అడ్డంగా సమలేఖనం చేస్తుంది. అలాగే దీనిలోని హార్మాన్ కార్డాన్ స్పీకర్‌లతో మంచి బేస్ తో కూడిన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది.

ఫార్మ్‌మూవీ థియేటర్.. ఇది 150-అంగుళాల స్క్రీన్ ను కలిగిఉన్న ఈ ప్రొజెక్టర్ 2800 ల్యూమన్‌ల కాంతిని ప్రొజెక్ట్ చేస్తుంది. 80 నుంచి 150 అంగుళాల వరకు ప్రొజెక్షన్ పరిమాణాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 4K UHD, స్పెక్కిల్ ఎలిమినేషన్ టెక్నాలజీతో అద్భుతమైన పిక్చర్ క్వాలిటీని ఆస్వాదించవచ్చు. వేగంగా కదిలే వస్తువులు సైతం చాలా స్పష్టంగా కనిపిస్తాయి. అందుకోసం ఎంఈఎంసీ సాంకేతికత ఈ ప్రొజెక్టర్ లో ఇచ్చాు. తద్వారా ఇది క్రీడలను వీక్షించేందుకు మంచి ఆప్షన్. డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

BenQ V6000 4K లేజర్ టీవీ ప్రొజెక్టర్.. ఈ ప్రొజెక్టర్ 3000 ల్యూమెన్‌ల కాంతితో చిత్రాలను ప్రొజెక్ట్ చేస్తుంది. ఇది 120-అంగుళాల పెద్ద స్క్రీన్ పరిమాణాన్ని అందిస్తుంది. 2,000,000:1 కాంట్రాస్ట్ రేషియో కూడా కలిగి ఉంది. 8.3 మిలియన్ విభిన్న పిక్సెల్‌లతో 4K UHD 3840×2160 రిజల్యూషన్ తో క్వాలిటీ పిక్చర్ ను అందిస్తుంది. ప్రొజెక్టర్ పైన ఆటోమేటిక్ సన్‌రూఫ్ స్లయిడర్ ఉంటుంది. ఇది ప్రొజెక్టర్ వినియోగంలో లేనప్పుడు దానిని సంరక్షిస్తుంది. ట్రెవోలో స్పీకర్‌లతో మంచి సౌండ్ క్వాలిటీ అందిస్తుంది.

Mi 4K లేజర్ ప్రొజెక్టర్.. 150 అంగుళాల స్క్రీన్ పరిమాణం కలిగిన ఎంఐ 4కే లేజర్ ప్రొజెక్టర్ 0.233:1 యొక్క అల్ట్రా-త్రో నిష్పత్తిని కలిగి ఉంది. దీనికి అదనపు వైరింగ్ అవసరం లేదు. ప్రొజెక్టర్ 3000:1 కాంట్రాస్ట్ రేషియోతో పాటు1600 ల్యూమెన్‌ల కాంతితో చిత్రాన్ని ప్రోజెక్ట్ చేస్తుంది. సినిమాల్లో ఉపయోగించే లేజర్ లైట్ టెక్నాలజీని కలిగి ఉన్నందున మీరు థియేటర్ వీక్షణ అనుభవాన్ని పొందుతారు. డ్యూయల్ ఫుల్ రేంజ్, డ్యూయల్ హై-ఫ్రీక్వెన్సీ ఆడియో సిస్టమ్ కలయికతో హై-ఫై సౌండ్ సిస్టమ్ మంచి సౌండింగ్ ను అందిస్తుంది.

AAO YG650 4K ప్రొజెక్టర్.. ఇది గేమింగ్ కు అనువైన ప్రొజెక్టర్ 2.4G/5G కనెక్టివిటీతో రు ఆండ్రాయిడ్ లేదాఐఓఎస్ ఫోన్ ద్వారా కంటెంట్‌ను సజావుగా ప్రసారం చేయవచ్చు. 1920×1080 రిజల్యూషన్ తో 7000 ల్యూమన్‌ కాంతితో చిత్రాలను ప్రదర్శించగలుగుతుంది. స్క్రీన్ పరిమాణాన్ని 40 అంగుళాల నుంచి 300 అంగుళాల వరకు సర్దుబాటు చేయవచ్చు. ఇది 8000:1 నుండి 10,000:1 వరకు కాంట్రాస్ట్ రేషియోను అందిస్తుంది. ఇది హైఫై స్టీరియో స్పీకర్‌ను కూడా కలిగి ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..