Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ నుంచి సూపర్ ప్లాన్.. రూ.699 రీచార్జితో విస్తృత ప్రయోజనాలు..

దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలలో ఎయిర్ టెల్ ఒకటి. దీని వినియోగదారుల సంఖ్య కూడా ఎక్కువే. ఈ కంపెనీ తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటోంది. దానికి అనుగుణంగా రీచార్జి ప్లాన్లను తీసుకు వస్తోంది. వినియోగదారులకు అపరిమిత కాల్స్ సౌకర్యం, డేటా అందించడంతో పాటు ఓటీటీ ద్వారా వినోదాన్నిఇవ్వడానికి చర్యలు చేపట్టింది.

Airtel Recharge Plan: ఎయిర్‌టెల్ నుంచి సూపర్ ప్లాన్.. రూ.699 రీచార్జితో విస్తృత ప్రయోజనాలు..
Airtel
Follow us

|

Updated on: Jun 17, 2024 | 3:26 PM

ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ తన వినియోగదారులకు మంచి రీచార్జి ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో కాల్స్ , డేటాతో పాటు 20+ ఓటీపీ యాప్‌లను వీక్షించవచ్చు. కేవలం రూ. 699తో రీచార్జి చేసుకుంటే 56 రోజుల వరకూ చెల్లుబాటు అవుతుంది. అలాగే 168 జీబీ డేటాను లభిస్తుంది.

మెరుగైన సేవలు..

దేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలలో ఎయిర్ టెల్ ఒకటి. దీని వినియోగదారుల సంఖ్య కూడా ఎక్కువే. ఈ కంపెనీ తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటోంది. దానికి అనుగుణంగా రీచార్జి ప్లాన్లను తీసుకు వస్తోంది. వినియోగదారులకు అపరిమిత కాల్స్ సౌకర్యం, డేటా అందించడంతో పాటు ఓటీటీ ద్వారా వినోదాన్నిఇవ్వడానికి చర్యలు చేపట్టింది. చెల్లుబాటు కాల వ్యవధిని పెంచడం, మెరుగైన డేటా అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

రూ.699 ప్లాన్..

ఎయిర్ టెల్ నుంచి కొత్త రీచార్జి ప్లాన్ విడుదలైంది. మిగిలిన వాటితో పోల్చితే మరింత మెరుగైన సేవలు అందించేలా రూపొందించింది. కేవలం రూ. 699 తో రీచార్జి చేసుకుంటే 56 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. ఆ కాల వ్యవధిలో ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 3 జీబీ డేలా లభిస్తుంది. 20 కంటే ఎక్కువ ఓటీటీ యాప్ లకు ఉచిత యాక్సెస్‌ లభిస్తుంది.

ఎన్నో లాభాలు..

ఎయిల్ టెల్ కొత్త 699 రీచార్జీ ప్లాన్ తో వినియోగదారులకు ఎన్నో లాభాలు కలుగుతాయి. మిగిలిన రీచార్జిలతో పోల్చితే ఎంతో లాభదాయకంగా ఉంటుంది. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా 56 రోజుల పాటు అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. అలాగే 168 జీబీ డేటా లభిస్తుంది. అంటే రోజుకు 3 జీబీ డేటా అందిస్తుంది. డేటాను ఎక్కువగా వినియోగించేవారికి ఈ ప్లాన్ చాాలా ఉపయోగంగా ఉంటుందని చెప్పవచ్చు.

వినియోగదారులకు ప్రతి రోజూ వంద ఎస్ఎమ్ఎస్ ఉచితంగా లభిస్తాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే సబ్‌స్క్రిప్షన్‌ దొరుకుతుంది. మీరు సోనీలివ్, ఈరోస్ నౌ, హోచోయ్, లయన్స్ గేట్ ప్లే, ఫాన్ కోడ్, మనోరమా మ్యాక్ తదితర 20 కంటే ఎక్కువ ఓటీటీ యాప్ లను యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఎయిర్‌ టెల్ వింక్ మ్యూజిక్‌తో ఉచిత రింగ్‌టోన్లు, అపరిమిత మ్యూజిక్ స్ట్రీమింగ్‌ లభిస్తుంది. అందుబాటులో ఉన్న చోట ఎటువంటి డేటా పరిమితులు లేకుండా 5జీ నెట్‌వర్క్ ను ఉచితంగా పొందవచ్చు.

జియో ప్లాన్లతో పోల్చితే..

మరో టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో కూడా 56 రోజుల ప్లాన్లు తీసుకువచ్చింది. వాటి వివరాలను, వినియోగదారులకు లభించే ప్రయోజనాలను తెలుసుకుందాం.

జియో రూ. 479 ప్లాన్..

జియో అందిస్తున్న రూ.479 ప్లాన్ 56 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. దీని ద్వారా రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్ ముగిసే వరకూ మొత్తం 84 జీబీ డేటా అందుతుంది. రోజుకు వంద ఉచిత ఎస్ఎమ్ ఎస్ లు, ఉచిత జాతీయ రోమింగ్‌ కూడా వినియోగదారులకు లభిస్తాయి.

రూ. 529 ప్లాన్..

జియో అందిస్తున్న మరో ప్లాన్ ఇది. దీని ద్వారా రూ. 479 ప్లాన్ లోని ప్రయోజనాలను పొందవచ్చు. మ్యూజిక్ స్ట్రీమింగ్ కోసం జీయోసావిఎన్ యాక్సెస్ మాత్రం అదనంగా లభిస్తుంది.

ఎయిర్ టెల్ ప్లాన్ బెస్ట్..

ఇతర టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు అందిస్తున్న ఇతర ప్లాన్లలతో పోల్చితే, ఎయిర్‌టెల్ రూ. 699 ప్లాన్ చాలా ఉపయోగంగా ఉంటుంది. డేటా అధికంగా లభించడంతో పాటు విస్తృత శ్రేణి ఓటీటీ కంటెంట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రోజుకు 3 జీబీ డేటా, 20 కంటే ఎక్కువ ఓటీటీ యాప్‌ల కోసం సబ్‌స్క్రిప్షన్‌ నాన్ స్టాప్ వినోదం లభిస్తుంది. డేటా ఎక్కువగా అవసరమయ్యే వారికి ఈ ప్లాన్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ప్లాన్ లో 5 జీ డేటా ఉచితంగా లభిస్తుంది. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాలలో ఉన్న వారికి మరింత లాభం చేకూర్చుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles