ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా హవా నడుస్తుంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్, ట్విట్టర్ వంటి యాప్స్ ద్వారా యువత ఎక్కువ తమ భావాలను ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు. అయితే టిక్‌టాక్ రాకతో భావాన్ని వ్యక్తం చేసే వారు షార్ట్ వీడియోలను ఎక్కువగా ఇష్టపడేవారు. అయితే కరోనా తదనంతర పరిస్థితుల్లో భారతదేశంలో టిక్‌టాక్ సహా చైనా యాప్స్‌పై బ్యాన్ విధించడంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్స్ షార్ట్ వీడియోలను చేసేలా తమ యాప్స్‌ను అప్‌డేట్ చేశాయి. ఇలా షార్ట్ వీడియోల విషయంలో ఫేస్‌బుక్, యూట్యూబ్ కంటే యువత ఎక్కువగా ఇన్‌స్టా గ్రామ్‌ను ఇష్టపడుతున్నారు. అయితే టిక్‌టాక్ యాప్‌లా వీడియో సేవ్ చేసే అవకాశం లేకపోవడంతో కొంతమేర యూజర్లు నిరుత్సాహానికి గురవుతున్నారు. అయితే తాజాగా ఇన్‌స్టా గ్రామ్ వీడియోలను సేవ్ చేసుకునే ఫీచర్‌ను అప్‌డేట్ చేసినట్లు పలు నివేదికల ద్వారా తెలుస్తుంది. ఈ అప్‌డేట్ గురించి మరిన్ని విషయాలపై ఓ లుక్కేద్దాం.
ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు యూఎస్‌లోని వినియోగదారులను పబ్లిక్ ఖాతాల ద్వారా భాగస్వామ్యం చేసిన రీల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనుమతిస్తుంది. మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ షేర్ మెనూలో డౌన్‌లోడ్ బటన్‌ను జోడించింది. అలాగే డౌన్‌లోడ్ చేసిన రీల్ మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా రోల్‌లో సేవ్ చేయబడుతుంది. పబ్లిక్ ఖాతాల ద్వారా భాగస్వామ్యం చేసిన రీల్స్ మాత్రమే డౌన్‌లోడ్ అవుతాయి. ఈ ఖాతాలు కావాలనుకుంటే డౌన్‌లోడ్‌లను ఆఫ్ చేసే అవకాశం ఉంటుంది. డౌన్‌లోడ్ చేసిన రీల్స్‌కు టిక్‌టాక్ మాదిరిగా వాటర్‌మార్క్ ఉంటుందో? లేదో? ఇన్‌స్టాగ్రామ్ ధ్రువీకరించనప్పటికీ ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి షేర్ చేసిన ప్రివ్యూ చిత్రం రీల్లో ఇన్‌స్టాగ్రామ్ లోగోను చూపింది. అయితే ఈ ఫీచర్ భారత్‌లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో? తెలియనప్పటికీ త్వరలోనే వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..