AIDS Injection: ఎయిడ్స్‌పై పోరులో కీలక ముందడుగు.. HIVని నిరోధించే తొలి టీకాకు అనుమతి

|

Dec 22, 2021 | 6:41 PM

AIDS Vaccine: ఎయిడ్స్ వ్యాధిపై ప్రపంచ దేశాలు సాగిస్తున్న పోరులో కీలక ముందడుగు పడింది. ఎయిడ్స్‌ వ్యాధి సోకకుండా నిరోధించే టీకాకు అమెరికా ఫెడరల్‌ డ్రగ్‌ అథారిటీ అనుమతి లభించింది.

AIDS Injection: ఎయిడ్స్‌పై పోరులో కీలక ముందడుగు..  HIVని నిరోధించే తొలి టీకాకు అనుమతి
AIDS Injection
Follow us on

ఎయిడ్స్ వ్యాధిపై ప్రపంచ దేశాలు సాగిస్తున్న పోరులో కీలక ముందడుగు పడింది. ఎయిడ్స్‌ వ్యాధి సోకకుండా నిరోధించే టీకాకు అమెరికా ఫెడరల్‌ డ్రగ్‌ అథారిటీ అనుమతి లభించింది. హెచ్‌ఐవీని నిరోధించే తొలి టీకాగా అప్రెట్యూడ్‌ రికార్డు సృష్టించబోతోంది. gsk సంస్థ ఈ వ్యాక్సినను తయారు చేసింది. హెచ్ఐవీ బారిన పడ్డ రోగులకు ఎయిడ్స్‌ వ్యాధి రాకుండా ఈ టీకా నిరోధిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నెల రోజుల వ్యవధిలో రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. తరువాత రెండు నెలలకు ఓసారి డోసులు తీసుకోవాలి.

ఒలిడ్‌ మాత్ర కంటే ఎయిడ్స్‌ను ఈ వ్యాక్సిన్‌ 66 శాతం నిరోధిస్తుందని పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి. హైరిస్క్‌ గ్రూపులపు ఈ వ్యాక్సిన్‌ సంజీవని అని అంటున్నారు శాస్త్రవేత్తలు. అమెరికాలో ఎయిడ్స్‌ వ్యాప్తిని అరికట్టడానికి చక్కగా ఉపయోగపడుతుందని కూడా అంటున్నారు.

అయితే హెచ్‌ఐవీ నెగెటివ్‌ వచ్చిన్న వాళ్లు మాత్రమే ఈ వ్యాక్సిన్‌ తీసుకోవాలని హెచ్చరక జారీ చేశారు. తొలి టీకాకు అనుమతి లభించడంతో ఎయిడ్స్‌పై ప్రపంచ దేశాలు సాగిస్తున్న పోరులో ఇది కీలక పరిణామంగా పేర్కొనవచ్చు.

Also Read..

Virat Kohli: మారిపోయిన విరాట్ కోహ్లీ గొంతు.. వింటే ఆశ్చర్య పోతారు.. వైరల్‎గా మారిన వీడియో..

Anti-Conversion Bill: మతమార్పిడి నిరోధక బిల్లుపై కర్ణాటకలో రగడ.. వ్యతిరేకంగా మైనారిటీ సంఘాలు భారీ ర్యాలీ!