Tecno Spark 20 Pro: లాంచింగ్‌కు సిద్ధమైన మరో బడ్జెట్‌ 5జీ ఫోన్‌.. అదిరే ఫీచర్స్‌

|

Jul 05, 2024 | 7:26 PM

ప్రస్తుతం మార్కెట్లో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ల హవా నడుస్తోంది. దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేసే ఫోన్‌లను కంపెనీలు తీసుకొస్తున్నాయి. మొదట్లో 5జీ ఫోన్‌ల ధరలు ఎక్కువగా ఉన్నా ప్రస్తుతం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లోనే 5జీ ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా...

Tecno Spark 20 Pro: లాంచింగ్‌కు సిద్ధమైన మరో బడ్జెట్‌ 5జీ ఫోన్‌.. అదిరే ఫీచర్స్‌
Tecno Spark 20 Pro
Follow us on

ప్రస్తుతం మార్కెట్లో 5జీ స్మార్ట్‌ ఫోన్‌ల హవా నడుస్తోంది. దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేసే ఫోన్‌లను కంపెనీలు తీసుకొస్తున్నాయి. మొదట్లో 5జీ ఫోన్‌ల ధరలు ఎక్కువగా ఉన్నా ప్రస్తుతం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లోనే 5జీ ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టెక్నో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం టెక్నో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. టెక్నో స్పార్క్‌ 20 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. జుల్‌ 9వ తేదీన ఇండియాలో ఈ ఫోన్‌ లాంచ్‌ కానుంది. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఈ ఫోన్‌ను 16 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో తీసుకురానున్నారు.

ఇక ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించనున్నారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్‌ పనిచేయనుంది. ఇందులో పంచ్‌ హోల్‌తో కూడిన 8 మెగాపిక్సెల్స్‌ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే రెయిర్‌ కెమెరా విషయానికొస్తే 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన కెమెరాను ఇవ్వనున్నారు. ట్రిపుల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్‌ రానుంది.

ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనుంది. ఐపీ53 రేటింగ్‌తో కూడిన వాటర్‌ రెసిస్టెంట్‌ను ఇవ్వనున్నారు. స్టీరియో స్పీకర్స్‌, సౌండ్ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రిట్ స్కానర్‌ను అందించనున్నారు. ఇక ఈ ఫోన్‌కు కుడి వైపున పవర్ బటన్‌తో పాటు వాల్యూమ్ రాకర్‌ను కూడా అందుబాటులో ఉంచనున్నారు. సౌండ్ విషయానికొస్తే డాల్బీ అట్మాస్ సెటప్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక ధర పరంగా చూస్తే ఈ ఫోన్‌ రూ. 20 వేలలోపు ఉండొచ్చని అంచనా.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..