Fridge: ఫ్రిజ్ ఎందుకు పేలుతుందో తెలుసా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

Refrigerator Mistakes: మీ ఇంట్లో ఫ్రిజ్‌ ఉందా..? మీరు కొన్ని పొరపాట్లు చేస్తున్నట్లయితే పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే నిపుణులు ఇలాంటి పొరపాట్లు చేయకూడదని పదేపదే సూచిస్తున్నారు. మీ ఫ్రిజ్‌ నుంచి ఇలాంటి సంకేతాలు వస్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు..

Fridge: ఫ్రిజ్ ఎందుకు పేలుతుందో తెలుసా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి.. లేదంటే ప్రాణాలకే ప్రమాదం!
Refrigerator Mistakes

Updated on: Aug 10, 2026 | 8:46 PM

Refrigerator Mistakes: ఈ రోజుల్లో చాలా ఇళ్లలో ఫ్రిజ్‌లను వాడుతున్నారు. వంటగదిలో ఫ్రిజ్ లేని ఇల్లు దాదాపుగా లేదు. అయితే, ఫ్రిజ్ నిర్వహణలో కొంత నిర్లక్ష్యం తీవ్రమైన ప్రమాదాలకు కారణం కావచ్చు.

ఇది కూడా చదవండి: House Construction: 100 గజాల స్థలంలో బేస్‌మెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..? పూర్తి లెక్కలు ఇవే..!

  1. ఫ్రిజ్‌కు సరైన విద్యుత్ సరఫరాను అందించండి: ఫ్రిజ్‌ను ఎల్లప్పుడూ సరైన, స్థిరమైన విద్యుత్ కనెక్షన్‌తో ఆపరేట్ చేయండి. వోల్టేజ్‌లో తరచుగా వచ్చే హెచ్చుతగ్గులు ఫ్రిజ్‌లోని కంప్రెసర్, విద్యుత్ భాగాలను ప్రభావితం చేయగలవు. వీలైతే, సరైన రేటింగ్ ఉన్న సాకెట్లు, రక్షణ పరికరాలను ఉపయోగించండి.
  2. ఫ్రీజర్‌లో మరీ ఎక్కువగా ఐస్‌ పేరుకుపోనివ్వవద్దు: ఫ్రీజర్‌లో ఎక్కువ కాలం పాటు మంచు అధికంగా పేరుకుపోవడం ఫ్రిజ్ పనితీరును ప్రభావితం చేస్తుంది. అసాధారణంగా అధికంగా మంచు పేరుకుపోతే, ఫ్రిజ్ సెట్టింగ్‌లను, డీఫ్రాస్ట్ సిస్టమ్‌ను తనిఖీ చేయండి. ఐస్‌ను తొలగించడానికి పదునైన వస్తువులను ఉపయోగించవద్దు.
  3. ఏదైనా సమస్య వస్తే, నిపుణుడితో మరమ్మత్తు చేయించండి: మీ ఫ్రిజ్‌లో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే దానిని మీరే తెరవడానికి ప్రయత్నించవద్దు లేదా తెలియని మెకానిక్‌తో మరమ్మత్తు చేయించవద్దు. ముఖ్యంగా కంప్రెసర్, వైరింగ్ లేదా రిఫ్రిజెరెంట్ సిస్టమ్‌లో లోపం ఉన్నట్లయితే మంచి అనుభవం ఉన్న సర్వీస్ టెక్నీషియన్ సహాయం తీసుకోవడం సురక్షితం.
  4. మీరు ఎక్కువసేపు బయట ఉండబోతున్నట్లయితే ఫ్రిజ్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోండి: మీరు ఎక్కువ సేపు ఇంటి నుండి బయటకు వెళ్తున్నప్పుడు ఫ్రిజ్ అవసరం లేకపోతే, దానిని ఆపివేయడానికి తయారీదారు సూచనలను పాటించండి. ఫ్రిజ్‌ను ఆపివేసే ముందు దానిలోని ఆహారాన్ని తీసివేసి, సరిగ్గా శుభ్రం చేయండి. దీనివల్ల విద్యుత్ ఖర్చులను కూడా ఆదా చేసుకోవచ్చు.
  5. ఫ్రిజ్ ఉష్ణోగ్రతను మరీ తక్కువగా ఉంచవద్దు: ఫ్రిజ్‌ను అవసరమైన దానికంటే ఎక్కువ చల్లగా ఉంచడానికి ఉష్ణోగ్రతను ఎల్లప్పుడూ అత్యల్ప స్థాయిలో ఉంచవద్దు. దీనివల్ల కంప్రెసర్ ఎక్కువసేపు కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది. తయారీదారు సిఫార్సు చేసిన విధంగా ఉష్ణోగ్రతను సెట్ చేయడం మంచిది.

ఫ్రిజ్ నుండి అసాధారణ శబ్దం లేదా వాసన వస్తుంటే జాగ్రత్తగా ఉండండి:

ఫ్రిజ్ నుండి కాలిపోతున్న వాసన వస్తే వైర్లు వేడెక్కితే, నిప్పురవ్వలు వస్తే, కంప్రెసర్ అసాధారణ శబ్దాలు చేస్తే, లేదా ఫ్రిజ్ తరచుగా ఆగిపోతుంటే, వెంటనే విద్యుత్‌ను ఆపివేసి, నిపుణుల సహాయం తీసుకోండి. ఇలాంటి సమస్యను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం.

గమనిక: ఫ్రిజ్ పేలుడుకు కారణాలు కేవలం ఐస్‌ పేరుకుపోవడానికే పరిమితం కావు. విద్యుత్ లోపాలు, వైరింగ్, కంప్రెసర్, రిఫ్రిజెరెంట్ సిస్టమ్ లేదా సరికాని మరమ్మతులు వంటి ఇతర కారణాలు కూడా ప్రమాదాన్ని కలిగించవచ్చు. ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి అధీకృత టెక్నీషియన్ ద్వారా తెలుసుకోవడం చాలా ముఖ్యమని గుర్తించుకోండి.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలులో ఎక్కిన తర్వాత లోయర్ బెర్త్ పొందడం ఎలా? ఇలా చేయండి..!

ఇది కూడా చదవండి: Maruti Car: ఫుల్ ట్యాంక్ చేస్తే 1200 కిలోమీటర్ల ప్రయాణం.. భారత్‌లో ఈ మారుతి కారు సరికొత్త రికార్డ్!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us