
మొబైల్ ఫోన్లు మన జీవితాల్లో ప్రాథమిక అవసరాలలో ఒకటిగా మారాయి. మొబైల్ ఫోన్‌లతో ఎంత ప్రయోజనాలు ఉన్నాయో, కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. మొబైల్ ఫోన్ పేలుళ్లు, ప్రమాదాల గురించి మనం తరచుగా వార్తలను చూస్తూ ఉంటాము. మన ఫోన్ కూడా పేలిపోతుందా అనే ప్రశ్న ఎప్పుడూ తలెత్తుతుంది. మొబైల్ ఫోన్లు వేడెక్కడం, సరిగ్గా ఛార్జింగ్ చేయకపోవడం, బ్యాటరీ లోపాలు, తయారీ లోపాలు వంటి కారణాల వల్ల పేలిపోవచ్చు. మన మొబైల్ ఫోన్లు పేలిపోవడానికి గల కారణాలు, దానిని ఎలా నివారించాలో చూద్దాం.
ఫోన్లు పేలిపోవడానికి ప్రధాన కారణం బ్యాటరీ సమస్యలు. చాలా స్మార్ట్‌ఫోన్‌లు లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగిస్తాయి. ఇది గొప్ప పనితీరును అందిస్తుంది. బ్యాటరీ పాడైపోయినప్పుడు, ఎక్కువసేపు ఛార్జ్ చేయబడినప్పుడు లేదా తీవ్రమైన ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు పేలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
కొన్నిసార్లు, తయారీ సమయంలో నాణ్యత లేనిబ్యాటరీలను ఇన్‌స్టాల్ చేస్తారు. అలాంటి పొరపాట్లు బ్యాటరీ పేలిపోయే ప్రమాదాన్ని పెంచుతాయి. కానీ ఇది చాలా అరుదు. దీని వలన తయారీ కంపెనీలు కొన్ని మోడళ్లను రీకాల్ చేస్తాయి.
మొబైల్ ఫోన్ కిందపడి పాడైపోతే, అది బ్యాటరీపై ప్రభావం చూపుతుంది. అలాగే, నష్టం ఫోన్ కాన్ఫిగరేషన్‌ను ప్రభావితం చేస్తుంది. అది పేలిపోయేలా చేస్తుంది. మీ ఫోన్‌ను ఓవర్ ఛార్జ్ చేయడం లేదా నాణ్యత లేని ఛార్జింగ్ కేబుల్‌లను ఉపయోగించడం వల్ల అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. రాత్రిపూట మీ ఫోన్‌ను ఛార్జ్ చేయడం లేదా తగని ఛార్జర్‌లను ఉపయోగించడం వల్ల వేడి పెరిగి బ్యాటరీ దెబ్బతింటుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి