AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spam Calls: మీ మొబైల్‌లో ఈ ఒక్క సెట్టింగ్‌తో స్పామ్‌ కాల్స్‌ నుంచి ఉపశమనం!

Spam Calls: ప్రతి రోజు స్పామ్‌ కాల్స్‌తో ఎంతో మంది ఇబ్బందులకు గురవుతున్నారు. సైబర్‌ నేరగాళ్లు వివిధ మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి స్పామ్‌ కాల్స్‌ మోసాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇలాంటి కాల్స్‌ను నిరోధించే టెక్నాలజీని తీసుకువస్తోంది.

Spam Calls: మీ మొబైల్‌లో ఈ ఒక్క సెట్టింగ్‌తో స్పామ్‌ కాల్స్‌ నుంచి ఉపశమనం!
Subhash Goud
|

Updated on: Oct 28, 2024 | 3:13 PM

Share

ప్రపంచ వ్యాప్తంగా ఎంత టెక్నాలజీ పెరిగినా మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మోసగాళ్లు స్మార్ట్‌ ఫోన్‌వాడేవారిని టార్గెట్‌ చేస్తున్నారు. ప్రతిరోజు స్పామ్ కాల్స్‌తో( Spam Calls) అనేకమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ స్పామ్‌ కాల్స్‌ వల్ల ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫోన్‌ కాల్స్‌ చేస్తూ సదరు వ్యక్తి వివరాలు తెలుసకోవడమో.. లేక ఏదో ఒక లింక్‌ పంపి దానిని ఓపెన్‌ చేయగానే వారి వివరాలు తెలుసుకునే విధంగా చేస్తున్నారు. అలాగే బ్యాంకు నుంచి, లేక మీకో పార్సిల్‌ వచ్చిందని.. అలా రకరకాల మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు.

ఈ స్పామ్‌ కాల్స్‌ వల్ల ఎంతో తెలివైన వారు కూడా మోసపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ స్పామ్‌ కాల్స్‌తో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు, అధికారులు పదేపదే హెచ్చరిస్తున్నారు. అయినా సైబర్‌ నెరగాళ్లు వివిధ కొత్త మార్గాలను ఎంచుకుంటూ మోసాలకు పాల్పడుతున్నారు. స్మార్ట్ ఫోన్‌లోని( Smart Phone ) కొన్ని సెట్టింగ్‌లను మార్చుకోవడం వలన ఈ స్పామ్ కాల్స్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు అని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతోపాటు ఎయిర్‌టెల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థలు ఈ స్పామ్‌ కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతున్నాయి. స్పామ్‌ కాల్స్‌ వినియోగదారుడికి చేరకుండానే ముందస్తుగానే గుర్తించి అడ్డుకునేలా టెక్నాలజీని రూపొందిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Ratan Tata: పెంపుడు కుక్కతో పాటు పని మనుషులకు కూడా ఆస్తి రాసిచ్చిన రతన్‌ టాటా!

ఇవి కూడా చదవండి

ఈ స్పామ్ కాల్‌లను నివారించడానికి వినియోగదారులు DND మోడ్‌ని ఉపయోగించవచ్చని అంటున్నారు. అయితే DND మోడ్‌ని ఇక్కడ ఎక్కువ కాలం ఆన్‌లో ఉంచలేరు. దీని కోసం మీరు ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని సెట్టింగ్స్‌కు వెళ్లిన తరువాత కాల్ సెట్టింగ్స్( Call Settings ) లేకుంటే సెర్చ్‌లో కాల్ సెట్టింగ్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. అప్పుడు వచ్చిన కాల్ సెట్టింగ్స్ ఆప్షన్ ఎంచుకుంటే దానిలో కాలర్ ఐడీ అండ్ స్పామ్ ప్రొటెక్షన్( Caller ID and Spam Protection ) ఆప్షన్‌ను ఆన్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Aadhaar Update: ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. కొత్త అప్‌డేట్‌.. కేంద్రం కీలక నిర్ణయం!

ఈ సెట్టింగ్‌ను మార్చడం వల్ల అప్పటివరకు ఉన్న స్పామ్ కాల్‌లు కూడా సహజంగానే బ్లాక్ అవుతాయి. అయితే అప్పటికే స్పామ్‌గా గుర్తించని ఫోన్ నంబర్లు మాత్రం బ్లాక్ కావు. ఇకపై మీకు ఎటువంటి అనవసరమైన కాల్స్ వస్తే మాత్రం వాటిని నియంత్రించవచ్చు.

థర్డ్ పార్టీ యాప్ నుంచి

ఈ సెట్టింగ్ ఆన్ చేసిన తర్వాత పలు సందర్భాలలో ఇతర నంబర్ల నుంచి కాల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గతంలో కంటే స్పామ్ కాల్స్ మాత్రం తగ్గుతాయని చెప్పవచ్చు. మరోవైపు ఇటివల టెలికాం నియంత్రణ సంస్థ TRAI కూడా ఫేక్ కాల్స్‌ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని టెలికాం కంపెనీలను కోరింది. మరోవైపు థర్డ్ పార్టీ కాలర్ ఐడి యాప్ ట్రూకాలర్ వినియోగదారుల ఫోన్‌లలో నకిలీ కాల్‌లను నిరోధించడానికి AI ఫిల్టర్‌లను రూపొందించింది. ట్రూ కాలర్ ఈ ఫీచర్‌ను భారతీయ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది.

Tech

దీనిని గుర్తించుకోండి:

మీరు ఈ ఫీచర్‌ని ఆన్ చేస్తే మీరు ఎలాంటి ఆన్‌లైన్ డెలివరీని (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్విగ్గీ, జొమాటో మొదలైనవి) తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొవచ్చు. ఎందుకంటే డెలివరీ బాయ్‌ల నంబర్‌లు మీ ఫోన్‌లో సేవ్ కానందున, వారు మీకు కాల్ చేయలేకపోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ ఫీచర్‌ని ఆన్ చేసిన తర్వాత ఇతర వ్యక్తులు స్పామ్‌గా నివేదించిన అన్ని స్పామ్ కాల్స్ నుంచి మీరు దూరంగా ఉంటారు. అయితే పలు కంపెనీలు మాత్రం ఇంకా స్పామ్ లేదా స్కామ్‌గా గుర్తించబడని నంబర్‌ను ఉపయోగిస్తే, మీకు వారి నుంచి కాల్స్ వచ్చే అవకాశం ఉందని గుర్తించుకోండి.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలు పట్టాలపై ఇసుక ఎందుకు పోస్తారో తెలుసా?.. కారణం ఏంటంటే..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి