Amazon Discounts: ఆ సామ్‌సంగ్‌ ఫోన్‌పై అమెజాన్‌లో అదిరే ఆఫర్‌.. కేవలం రూ.1499కే సామ్‌సంగ్‌ ఎం 33 ఫోన్‌

ఇటీవల కాలంలో సామ్‌సంగ్‌ ఎం సిరీస్‌ అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ ఎం సిరీస్‌లోని ఓ ఫోన్‌పై ప్రస్తుతం అమెజాన్‌ అదిరిపోయే డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. సామ్‌సంగ్‌ ఎం 33 5జీ ఫోన్‌ సామ్‌సంగ్‌ రిలీజ్‌ చేసే 5జీ ఫోన్స్‌ అత్యంత సరసమైన ధరలో వస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌ ఇప్పటికే అమ్మకాల విషయంలో ఓ మార్క్‌ను సెట్‌ చేసింది. అయితే ఈ ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్‌లో ఎంత ధరకు అందుబాటు ఉంది?అనే విషయంతో పాటు ఈ ఫోన్‌ ఫీచర్లు కూడా ఓ సారి తెలుసుకుందాం.

Amazon Discounts: ఆ సామ్‌సంగ్‌ ఫోన్‌పై అమెజాన్‌లో అదిరే ఆఫర్‌.. కేవలం రూ.1499కే సామ్‌సంగ్‌ ఎం 33 ఫోన్‌
Samsung M 33
Follow us
Srinu

|

Updated on: Sep 17, 2023 | 8:15 PM

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా వివిధ కంపెనీలు తమ కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి రిలీజ్‌ చేస్తున్నాయి. అయితే ఎన్ని మోడల్స్‌ ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చినా సామ్‌సంగ్‌ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ వేరు. ముఖ్యంగా మొబైల్‌ ఫోన్స్‌ విషయంలో సామ్‌సంగ్‌ ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ ఉంది. అయితే సామ్‌సంగ్‌ కూడా ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ రిలీజ్‌ చేస్తూనే భారతదేశంలో ఉన్న మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఉండేలా చూసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో సామ్‌సంగ్‌ ఎం సిరీస్‌ అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ ఎం సిరీస్‌లోని ఓ ఫోన్‌పై ప్రస్తుతం అమెజాన్‌ అదిరిపోయే డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. సామ్‌సంగ్‌ ఎం 33 5జీ ఫోన్‌ సామ్‌సంగ్‌ రిలీజ్‌ చేసే 5జీ ఫోన్స్‌ అత్యంత సరసమైన ధరలో వస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌ ఇప్పటికే అమ్మకాల విషయంలో ఓ మార్క్‌ను సెట్‌ చేసింది. అయితే ఈ ఫోన్‌ ప్రస్తుతం అమెజాన్‌లో ఎంత ధరకు అందుబాటు ఉంది?అనే విషయంతో పాటు ఈ ఫోన్‌ ఫీచర్లు కూడా ఓ సారి తెలుసుకుందాం.

రూ.1499కే ఫోన్ ఇలా

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం 33 5 జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ +128 జీబీ స్టోరేజీని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ అసలైన ధర రూ.25,999గా ఉంది. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.17,999కే అందిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొంటే రూ.1,750 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ ఫోన్‌పై రూ.16,500 వరకు ఎక్స్ఛేంజ్‌ ధరను కూడా అందిస్తుంది. అంటే ఈ ఫోన్‌ను రూ.1499కే పొందవచ్చు. అయితే ఎక్స్చేంజ్‌ ధర మాత్రం ఎక్స్చేంజ్‌ చేసే ఫోన్‌ పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. 

సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం 33 స్పెసిఫికేషన్లు

ఈ సామ్‌సంగ్‌ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్‌ 12.0, వన్‌ యూఐ 4 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. అవుతుంది. ఈ ఫోన్‌ 12 బ్యాండ్ సపోర్ట్‌తో ఎక్సినోస్‌ 1280 ఆక్టా కోర్ 2.4 జీహెచ్‌జెడ్‌ 5 ఎన్‌ఎం ప్రాసెసర్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకత. ఈ స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ రిజల్యూషన్‌తో వస్తుంది . అంతేకాకుండా 1080×2400 పిక్సెల్‌లను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్‌లో గొరిల్లా గ్లాస్ 5 ఈ ఫోన్‌కు అదనపు రక్షణను అందిస్తుంది. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం 33 స్మార్ట్‌ఫోన్‌లో క్వాడ్ కెమెరా 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు, 5 ఎంపీ, 2 ఎంపీ, 2 ఎంపీ నాలుగు కెమెరాల సెటప్‌తో వస్తుంది. అలాగే  8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పని చేస్తుంది. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం 33 5 జీ స్మార్ట్‌ఫోన్ 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పని చేస్తుంది. ఇంటెలిజెంట్ వాయిస్ ఫోకస్, పవర్ కూల్ టెక్నాలజీతో పాటు ఆటో డేటా స్విచింగ్ వంటివి ఈ ఫోన్‌కు ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?