సోనీ కంపెనీ రియాన్ పాకెట్ పేరిట స్మార్ట్ ఫోనంత ఉండే ఒక ఏసీని తయారు చేసింది. దీన్ని ఉపయోగించాలంటే ఆ కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసిన షర్టు కూడా ఉండాల్సిందే. ఎందుకంటే ఈ షర్టు వెనకాల అమర్చిన జేబులో ఈ బుల్లి ఏసీ పెట్టేసుకోవచ్చు. దీంతో శరీరానికంతటికీ చల్లదనం అందుతుంది. మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో ఉండేలా దీని ధరను రూ. 9 వేలకు ఖరారు చేశారు. ప్రస్తుతం పురుషులకు మాత్రమే సూటయ్యేలా ఉన్న ఈ ప్రాడక్టు భవిష్యత్తులో మహిళలకు కూడా అందుబాటులోకి తెస్తామని సంస్థ తెలిపింది. దీనికి ఓ రెండు గంటలు చార్జింగ్ పెట్టుకుంటే 90 నిమిషాల పాటు ఉపయోగించుకోవచ్చు. బ్లూటూత్‌తో స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకొని ఈ ఏసీని కంట్రోల్ చేయొచ్చు. ప్రస్తుతం జపాన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ బుల్లి ఏసీని అతి త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సోనీ ప్రకటించింది.