iPhone 13: ఐఫోన్‌ 13లో కొత్త సమస్య.. పింక్‌ కలర్‌గా మారుతున్న స్క్రీన్‌..!

| Edited By: Ravi Kiran

Jan 24, 2022 | 7:00 AM

iPhone 13: ప్రస్తుతం మొబైల్‌ వినియోగం భారీగా పెరిగిపోయింది. యాపిల్‌ కంపెనీ నుంచి రకరకాల స్మార్ట్‌ ఫోన్లు విడుదలవుతున్నాయి...

iPhone 13: ఐఫోన్‌ 13లో కొత్త సమస్య.. పింక్‌ కలర్‌గా మారుతున్న స్క్రీన్‌..!
Follow us on

iPhone 13: ప్రస్తుతం మొబైల్‌ వినియోగం భారీగా పెరిగిపోయింది. యాపిల్‌ కంపెనీ నుంచి రకరకాల స్మార్ట్‌ ఫోన్లు విడుదలవుతున్నాయి. యాపిల్‌ ఐఫోన్‌ 13 సిరీస్‌లో పింక్‌ స్క్రీన్‌ ఎలాంటి కారణం లేకుండానే పింక్‌ కలర్‌గా మారుతోందని కొంత మంది వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. సాఫ్ట్‌ వేర్‌ అప్‌డేట్‌, మొబైల్‌ రీసెట్‌ చేసినా అలాగే వస్తుందని, ఎలాంటి ఫలితం ఉండటం లేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. అంతేకకాకుండా మొబైల్‌ నెమ్మదించడం, ఆటోమేటిక్‌గా రీస్టార్ట్‌ కావడం వంటి కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయని పేర్కొంటున్నారు. అయితే సెట్టింగ్‌లో రీసెట్‌ చేసినట్లయితే సమస్య తలెత్తడం లేదని కొంత మంది చెబుతున్నట్లు తెలిసింది.

ఐఫోన్‌ 13 యూజర్లు షేర్‌ చేసిన ఫోటోలను గమనిస్తే.. డిస్‌ప్లే మొత్తం పూర్తిగా పింక్‌గా మారడం లేనట్లుగా కనిపిస్తోంది. సిస్టమ్‌ సాఫ్ట్‌ వేర్‌లో లోపం వల్ల ఇలాంటి సమస్య తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే రాబోయే అప్‌డేట్‌లో ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఇక పింక్‌ స్క్రీన్‌ సమస్య ఎదుర్కొంటున్నవారు తమ డేటాను బ్యాకప్‌ చేసి తాజా ఆరేటింగ్‌ సిస్టమ్‌కు అప్‌గ్రేడ్‌ కావాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు. తాజా అప్‌డేట్స్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయం యాపిల్‌ ఇంకా వెల్లడించలేదు.

ఇవి కూడా చదవండి:

LIC Plan: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే స్కీమ్‌.. ఇందులో చేరితో నెలనెలా పెన్షన్‌ పొందవచ్చు.. పూర్తి వివరాలు

Oppo Reno 7 5G: భారత్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఒప్పో రెనో 7 5జీ స్మార్ట్‌ఫోన్లు..!