
యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా తిలకించిన సూర్యగ్రహణం ముగిసింది. దేశంలో పాక్షికంగా ఏర్పడింది సూర్యగ్రహణం. గరిష్టంగా గంటా 45 నిమిషాల పాటు గ్రహణం కొనసాగింది. చాలా జాగ్రత్తలతో ఎక్లిప్స్‌ని జనం ఆసక్తిగా తిలకించారు. మరోవైపు గ్రహణం కారణంగా నిర్మానుష్యంగా మారిపోయాయి రహదారులు. 22ఏళ్ల తర్వాత ఏర్పడిన సూర్య గ్రహణంతో ఆలయాలన్నీ క్లోజ్ అయ్యాయి. అయితే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో మాత్రం పూజాధికాలు యధావిధిగా కొనసాగాయి. దేశంలో సూర్యగ్రహణం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రారంభమైంది. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా ఈశాన్య ప్రాంతాలు, పశ్చిమాసియా, నార్త్ అట్లాంటిక్ సముద్ర తీరం, హిందూ మహాసముద్రం ఉత్తర ప్రాంతంలో నివసించే ప్రజలు పాక్షికంగా సూర్యగ్రహణాన్ని తిలకించారు.
ఢిల్లీలో 4.29 నిమిషాలకి.. హైదరాబాద్‌లో 4 గంటల 59.. విశాఖలో 5 గంటల 2 నిమిషాలకు గ్రహణం ప్రారంభమైంది. సోలార్ ఎక్లిప్స్‌ని తిలకించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పాక్షిక సూర్యగ్రహణాన్ని కొంతమంది బ్లాక్ ఫిల్మ్, గాగుల్స్ సాయంతో చూసి ఫిదా అయ్యారు. దాదాపు గంటా 45 నిమిషాలపాటు సూర్య గ్రహణం కనువిందు చేసింది. గ్రహణం ఎఫెక్ట్‌తో నగర రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. జనం బయటకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. గ్రహణం పూర్తయ్యాక శుద్దిస్నానమాచరించారు చాలామంది. ఏడున్నర గంటల తర్వాత సంప్రోక్షణ అనంతరం ఆలయాలు తెరుచుకున్నాయి.
పాక్షిక సూర్యగ్రహణం మళ్లీ 27 ఏళ్ల తర్వాత ఏర్పడనుంది. 2025 లో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నా.. అది భారత్ లో కనిపించదు. మళ్లీ మనం సూర్యగ్రహణం వీక్షించాలంటే 2032 వరకు ఆగాల్సిందే. ఈ కారణంగానే చాలామంది సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ఆసక్తి చూపారు.
మరిన్ని సైన్స్&టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..