మార్కెట్‌లో రాణించాలంటే కస్టమర్ల అభిరుచులు, ఆసక్తులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ప్రోడక్ట్స్ తీసుకురావడం చాలా ముఖ్యం. ప్రధానంగా స్మార్ట్ ఫోన్ల విషయంలో ఇది తప్పనిసరి. అందుకే.. స్మార్ట్ తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీ, ఫీచర్లలతో తమ ప్రోడక్ట్స్‌ని మార్కెట్‌లో విడుదల చేస్తాయి. మారుతున్న కాలం, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, ప్రజల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా మొబైల్ ఫోన్స్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తుంటాయి. ఈ క్రమంలో ఇటీవలి కాలంలో ఫోల్డబుల్ ఫోన్‌లు మార్కెట్‌ను శాసిస్తున్నాయి. చాలా మంది వినియోగదారులు ఫోల్డబుల్ ఫోన్లలో విపరీతంగా లైక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన భారత మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల వివరాలను మీ ముందుకు తీసుకువచ్చాం. వాటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 89,999. 3.26-అంగుళాల కవర్ స్క్రీన్, 6.8-అంగుళాల మెయిన్ స్క్రీన్‌ను కలిగి ఉంది. బ్లాక్, పర్పుల్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. ఫోటోగ్రఫీ కోసం, ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ముందు భాగంలో 32MP కెమెరా ఉంది. స్మార్ట్‌ఫోన్ డైమెన్సిటీ 9000+ చిప్‌సెట్, 4300 mAh బ్యాటరీతో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
ఈ ఫోన్ ధర రూ.1,54,999 నుండి ప్రారంభమవుతుంది. 3 రంగులలో స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది. మొబైల్ ఫోన్ 7.6 అంగుళాల ప్రధాన డిస్‌ప్లే, 6.2-అంగుళాల కవర్ స్క్రీన్ ఉంది. ప్రైమరీ కెమెరా 50MP + 12MP + 10MP తో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. 4,400 mAh బ్యాటరీ కెపాసిటీ కలిగిఉంది.
ఇది 6.7-అంగుళాల ప్రధాన డిస్‌ప్లే, 1.9-అంగుళాల కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోటోగ్రఫీ కోసం 12 + 12MP రెండు కెమెరాలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.89,999. 3700 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంది.
6.42 అంగుళాల ఔటర్ డిస్‌ప్లే, 7.85 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే కలిగిన ఈ ఫోన్‌లో 50MP+50MP+13MP ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్లస్ చిప్‌సెట్, 5000 mAh బ్యాటరీ బ్యాకప్, 45 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ కలిగి ఉంది. దీని ధర రూ. రూ.88,888 గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..