Skoda Kushaq: చెక్ దేశపు వాహన తయారీ సంస్థ స్కోడా.. గురువారం తన కొత్త కుషాక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా తయారైన తొలి ఉత్పత్తిగా కుషాక్ ఘనత సాధించిందని పేర్కొంది. మధ్య తరహా ఎస్‌యూవీ విభాగంలోని హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మోడళ్లకు కుషాక్ పోటీ ఇవ్వనుందని తెలుస్తోంది. ఇందులో టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు కలిగి ఉంది. మొదటిది 1.0 లీటర్ మూడు సిలిండర్ల టీఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్ 115 బీహెచ్‌పీ శక్తిని, 175 ఎన్‌ఎమ్ టార్క్ అందిస్తుంది. రెండోది 1.5 లీటర్ టీఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్ 150 బీహెచ్‌పీ శక్తిని అందించనుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్, 7-స్పీడ్ డీఎస్‌జీ గేర్‌బాక్స్ తో రానుంది.
అలాగే హ్యుందాయ్ క్రెటా బుకింగ్ లు జులై 12 నుంచి మనదేశంలో ప్రారంభించనున్నారు. అయితే, ఆ రోజు నుంచే స్కోడా ఆటో 2021 స్కోడా కుషాక్ డెలివరీలు ప్రారంభమవుతాయని ప్రకటించింది. కుషాక్ డెలివరీలకు సంబంధించి ట్విట్టర్‌లో అడిగిన ఓ ప్రశ్నకు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ సమాధానమిచ్చారు. “డెలివరీలు జూలై 12 న ప్రారంభమవుతాయి. బుకింగ్‌లు అయిన వెంటనే కార్లను డెలివరీలు చేయడం ప్రారంభిస్తామని, ఎక్కువ సంఖ్యలో బుకింగ్‌లు వస్తే డెలివరీలు చేసేందుకు కొంచెం ఆలస్యం కావొచ్చని” తెలిపారు.
నూతన కుషాక్ పొడవు 4,225 మిమీ, వెడల్పు 1,760 మిమీ కాగా, ఎత్తు 1,612 మిమీ. ఇది 2,651 మిమీ పొడవైన వీల్‌బేస్ తోపాటు 188 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. యాక్టివ్, అంబిషన్, స్టైల్ వేరియంట్‌లతో రానున్న 2021 కుషాక్ ధర రూ .10 లక్షల నుంచి రూ .17 లక్షల మధ్య ఉంటుంది (ఎక్స్‌షోరూమ్). హైఎండ్ వేరియంట్‌లో ఎల్‌ఈడీ హెడ్‌లైట్‌లు, ఎల్‌ఈడీ టైల్లైట్స్, 17-అంగుళాల అట్లాస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, టచ్‌స్క్రీన్ క్లైమాట్రోనిక్ ఏసీ, రెండు -స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌వీఎం, యాంబియంట్ లైటింగ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగులు, టీపీఎంఎస్ తోపాటు ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ ఉండనున్నట్లు కంపెనీ తెలిపింది.
Deliveries will start on the 12th of July. How long an order takes to deliver will of course depend on the number of bookings we recieved against production capacity.
— Zac Hollis (@Zac_Hollis_) June 24, 2021
Also Read:
ఏలియన్స్ ఉంటే కచ్చితంగా మనల్ని చూస్తూనే ఉంటారు!లీసా కాల్టేనెగర్ వివరణ :Aliens.
DRDO Pinaka Rockets: పినాక రాకెట్ల ప్రయోగాలు విజయవంతం: డీఆర్డీవో