Smartphone: పాత ఫోన్ అమ్మేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జీవితాంతం బాధపడతారు..

పాత ఫోన్ అమ్మేస్తున్నారా.. అయితే జాగ్రత్త.. మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యల్లో చిక్కుకోవడం గ్యారంటీ. మీ సమాచారం, వ్యక్తిగత వివరాలు అన్నీ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. అసలు పాత ఫోన్ విక్రయించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది ఇప్పుడు చూద్దాం.

Smartphone: పాత ఫోన్ అమ్మేస్తున్నారా..? ఈ తప్పులు చేస్తే జీవితాంతం బాధపడతారు..
Smartphone

Updated on: Jun 18, 2026 | 12:13 PM

ఫోన్ చెడిపోయిన సమయంలో లేదా ఒకే ఫోన్ చాలా రోజుల నుంచి వాడుతున్నా విసిగిచెంది ఫోన్లను మారుస్తూ ఉంటారు. పాత ఫోన్లను విక్రయించి కొత్త ఫోన్ కొనుగోలు చేస్తూ ఉంటారు. కొంతమంది ఎక్సైంజ్ ఆఫర్‌లో తమ వద్ద ఉన్న ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ తీసుకుంటారు. ఇలాంటి సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. పాత ఫోన్‌లో మీ వ్యక్తిగత సమాచారం మొత్తం ఉంటుంది. బ్యాంకింగ్ వివరాలు, పర్సనల్ ఫొటోలు, డాక్యుమెంట్స్ లాంటి సున్నితమైన వివరాలు ఉంటాయి. ఫైల్, గ్యాలరీ, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్ లాంటి ఫ్లాట్‌ఫామ్స్‌లో మీ డాక్యుమెంట్స్ సేవ్ అయి ఉంటాయి. వాటిని గుర్తించకుండా ఫోన్ విక్రయిస్తే మీ డీటైల్స్ అన్నీ లీక్ అవ్వడం వల్ల ఇబ్బందులకు గురవుతారు. ఇంతకు ఫోన్ అమ్ముముందు ఏ పనులు చేయాలనేది చూద్దాం.

డేటా బ్యాకప్ తప్పనిసరి

మీ ఫోన్లోని డేటా మీకు తర్వాత ఉపయోపడే అవకాశముంటుంది. ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్‌లు, యాప్ డేటా మొత్తాన్ని బ్యాకప్ పెట్టుకోండి. గూగుల్ డ్రైవ్, iCloud వంటి ఫ్లాట్‌ఫామ్ ద్వారా మీ డేటా మొత్తాన్ని సేవ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల కొత్త ఫోన్ కొనుగోలు చేశాక ఈ డేటా మొత్తాన్ని పొందేందుకు సులువవుతుంది.

సిమ్, మెమెరీ కార్డ్ విషయంలో జాగ్రత్త

ఇక మీ ఫోన్‌లోని సిమ్ కార్డ్, మెమరీ కార్డ్‌ను తీసివేయాలి. ఎందుకంటే వాటి ద్వారా మీ పర్సనల్ డేటా మొత్తం బయట పడుతుంది. దీంతో ఫోన్ విక్రయించే ముందు తప్పనిసరిగా ఈ పని చేయాలి. అలాగే ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. సెట్టింగ్స్ > సిస్టమ్ > రీసెట్ > ఫ్యాక్టరీ డేటా రీసెట్‌ ప్రక్రియను మీరు అనుసరించాలి. దీని వల్ల మీ ఫోన్‌లోని డేటా మొత్తం పోయి సాధారణ స్థితికి వస్తుంది.

వీటిని లాగౌట్ చేయండి..

ఇక ఫోన్‌లో Google, Apple, ఇమెయిల్, సోషల్ మీడియా, ఇతర యాప్‌లు లేదా సేవల వంటి మీ అన్ని ఖాతాలను లాగ్ అవుట్ చేయండి. వీటిల్లో మీ వ్యక్తిగత సమాచారం దాగి ఉంటుంది. లాగౌట్ చేయడం వల్ల సమస్యలు ఉండవు. ఇక ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ (FRP) ఆప్షన్ నిలిపివేయండి. దీని వల్ల కొత్త యజమాని ఎటువంటి సమస్యలు లేకుండా ఫోన్‌ను సెటప్ చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. సెట్టింగ్స్ > సెక్యూరిటీ > ఫైండ్ మై డివైస్ > డియాక్టివేట్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.

మీ నిల్వను తుడిచివేయండి

అదనపు భద్రత కోసం మీ స్టోరేజ్‌ను ఎన్‌క్రిప్ట్ చేయండి. ఆపై దాన్ని పూర్తిగా తుడిచివేయండి. మీ ఫోన్ సెక్యూరిటీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఇక అనవసరమైన పరికరాలు ఏమైనా ఉన్నాయేమో తనిఖీ చేయండి. ఫోన్ కేస్‌లు, స్క్రీన్ ప్రొటెక్టర్‌లు, ఇతర యాక్సెసరీలను తప్పకుండా తీసివేయండి. మీరు వీటిని విడిగా అమ్ముకోవచ్చు.

Follow Us