AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Galaxy F15 5G: బడ్జెట్‌ ధరలో 5జీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? సామ్‌సంగ్‌ నుంచి స్టన్నింగ్ ఫోన్‌..

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌15 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌15 5జీ స్మార్ట్ ఫోన్‌లో 5 ఏళ్లు సెక్యూరిటీ అప్‌డేట్‌ను అందిస్తున్నారు. స్క్రీన్ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు...

Galaxy F15 5G: బడ్జెట్‌ ధరలో 5జీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? సామ్‌సంగ్‌ నుంచి స్టన్నింగ్ ఫోన్‌..
Galaxy F15 5g
Narender Vaitla
|

Updated on: Mar 15, 2024 | 5:59 PM

Share

ప్రస్తుతం దేశంలో 5జీ నెట్‌వర్క్‌ సేవల విస్తృతి పెరుగుతోంది. దేశంలో చిన్న చిన్న పట్టణాల్లోనూ 5జీ సేవలు విస్తరిస్తున్నాయి. 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసే ఫోన్‌లు మార్కెట్లో హల్చల్‌ చేస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో 5జీ హ్యాండ్‌సెట్‌ల ధరలు కూడా భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం అయిన సామ్‌సంగ్ సైతం తాజాగా మార్కెట్లోకి బడ్జెట్‌ 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది.

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌15 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌15 5జీ స్మార్ట్ ఫోన్‌లో 5 ఏళ్లు సెక్యూరిటీ అప్‌డేట్‌ను అందిస్తున్నారు. స్క్రీన్ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా5 ప్రొటెక్షన్‌ స్క్రీన్‌ను ఇచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ర్యామ్‌ ప్లస్ ఫీచర్‌తో ర్యామ్‌ను పెంచుకునే అవకాశం కల్పించారు.

ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో నాక్‌ సెక్యూరిటీని అందించారు. సామ్‌సంగ్‌ వ్యాలెట్‌కు ఈ ఫోన్‌ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌ 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లో తీసుకొచ్చారు. మెమోరీ కార్డుతో 1 టీబీ వరకు మెమోరీని పెంచుకోవచ్చు. 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. 25 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 100 శాతం ఛార్జింగ్‌ కావడానికి సుమారు 2 గంటల సమయం పడుతుందని కంపెనీ చెబుతోంది.

ఇక ఫోన్‌ కంటిన్యూగా వాడినా ఒటికన్నర రోజులు వస్తుందని చెబుతోంది. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ట్రిపుల్‌ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. బ్లూటూత్‌ 5.3 వంటి కనెక్టివిటీ ఫీచర్‌ను అందించారు. ఇందులో ప్రత్యేకంగా వాయిస్‌ ఫోకస్‌ మోడ్‌ను అందించారు. దీంతో నాయిస్‌ లెస్‌ కాల్స్‌ను పొందొచ్చు. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ 4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 14,000కాగా, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 15,000గా నిర్ణయించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?