Samsung Balance Mouse: ఆఫీసుల్లో టార్గెట్లు సర్వసాధారణమైన విషయం. ప్రాజెక్ట్‌ను ఇన్‌టైమ్‌లో కంప్లీట్ చేయాలన్న ఒత్తిడి ఉండే ఉంటుంది. దీంతో ఉద్యోగులు కూడా ఓవర్‌టైమ్ పనిచేస్తుంటారు. కంపెనీలు ఒత్తిడి పెట్టకపోయినా కొందరు ఉద్యోగులు సమయాన్ని కూడా మరిచిపోయి పని చేస్తూనే ఉంటారు. అయితే సామ్‌సంగ్ తీసుకొస్తున్న కొత్త మౌస్‌తో ఇకపై ఇది సాగదు. ఎందుకంటే ఉద్యోగులు తమ డ్యూటీ టైమ్ తర్వాత పనిచేస్తే పారిపోయే మౌస్‌ను రూపొందిస్తున్నారు. మౌస్ పారిపోవడం ఏంటని ఆలోచిస్తున్నారు కదూ.! అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ కంపెనీ.. ‘బ్యాలెన్స్ మౌస్’ పేరుతో మార్కెట్లోకి కొత్త గ్యాడ్జెట్‌ను తీసుకొస్తోంది. ఉద్యోగి ఓవర్ టైమ్ పనిచేస్తే మౌస్ నిజంగానే ఎలుకలా మారిపోయి పారిపోతుంది. తాజాగా ఈ గ్యాడ్జెట్‌కు సంబంధించిన కాన్సెప్ట్ వీడియోను సామ్‌సంగ్ అధికారికంగా విడుదల చేసింది. బ్యాలెన్స్ మౌస్ ఎలా పనిచేస్తుందన్న దానికి సంబంధించి రూపొందించిన గ్రాఫిక్ వీడియో ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోలో ఓ ఉద్యోగి ఓవర్‌టైమ్ తర్వాత కూడా పనిచేసేందుకు మౌస్‌ను టచ్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. దీంతో వెంటనే మౌస్ ముందు భాగంలో రెండు చెవులు బయటకు వస్తాయి.
అప్పటికీ మౌస్‌ను పట్టుకోవడానికి ప్రయత్ని్స్తే కింద వెంటనే వీల్స్ ఓపెన్ అయ్యి.. మాస్ తుర్రుమని పారిపోతుంది. యూజర్ చేతిని గుర్తించేందుకు బ్యాలెన్స్ మౌస్‌లో సెన్సర్లు ఉన్నాయి. సామ్‌సంగ్ త్వరలోనే మార్కెట్లోకి ఈ కొత్త రకం మౌస్‌ను తీసుకొచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. కాన్సెప్ట్ వీడియోతోనే టెక్ రంగంలో అలజడి సృష్టించిన సామ్‌సంగ్.. గ్యాడ్జెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..