Samsung Smartphone: లాంచ్‌కు ముందే ఆ సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీక్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో భారతదేశ వాటా చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో అన్ని కంపెనీలు తమ కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్లను భారత్‌లో లాంచ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. తాజా ప్రముఖ కంపెనీ సామ్‌సంగ్ త్వరలోనే భారత్‌లో తన గెలాక్సీ ఎస్-25 ఎడ్జ్ ఫోన్‌ను లాంచ్ చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. అయితే లాంచ్‌కు ముందే ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఇవేనంటూ కొన్ని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

Samsung Smartphone: లాంచ్‌కు ముందే ఆ సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీక్.. ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Samsung Galaxy S25 Edge

Updated on: Apr 26, 2025 | 4:00 PM

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్-25 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ మే 23న లాంచ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటివరకు సామ్‌సంగ్ రిలీజ్ చేసిన స్మార్ట్ ఫోన్స్‌లో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా రికార్డులను సృష్టించనుంది. గెలాక్సీ ఎస్-25 సిరీస్‌లోని ఇతర ఫోన్స్‌ మాదిరిగానే ఫ్లాగ్‌షిప్ లక్షణాలను కలిగి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనవరిలో నిర్వహించిన గెలాక్సీ అన్‌ప్యాక్‌డ్  ఈవెంట్ సందర్భంగా సామ్‌సంగ్ కంపెనీ మొదట ఈ ఫోన్ గురించి కీలక విషయాలను పేర్కొంది. అప్పటి నుంచి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్-25 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ గురించి అనేక లీక్లు వస్తున్నాయి. అయితే ఇటీవల లీక్‌లు రాబోయే మోడల్ ధరను కూడా వెల్లడిస్తున్నారు. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్-25 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ ధర ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన గెలాక్సీ ఎస్25 ప్లస్ ధర కంటే కాస్త ఎక్కువ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

గెలాక్సీ ఎస్-25 ఎడ్జ్ ధర దాదాపు రూ. 1,03,000 వరకు ఉంటుందని నిపునులు చెబుతున్నారు. అంటే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్-25 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ ధర గెలాక్సీ ఎస్25 ప్లస్ ధర కంటే కాస్త ఎక్కువ. ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధర రూ. 88,500గా ఉంది. ఎస్-25 ఎడ్జ్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. 8 జీబీ + 256 జీబీ, 12 జీబీ + 512 జీబీ వేరియంట్స్‌లో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. టాప్-టైర్ వేరియంట్ ధర సుమారు రూ. 1,14,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్-25 ఎడ్జ్ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ రెండు రంగు ఎంపికలలో వస్తుంది. టైటానియం సిల్వర్ కలర్‌తో పాటు టైటానియం జెట్ బ్లాక్ కలర్స్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్-25 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, ప్రైమరీ 200 ఎంపీ కెమెరా, సెకండరీ 12 ఎంపీ కెమెరాతో వస్తుందని ఈ ఫోన్‌ గురించి లీక్‌ల ద్వారా వెల్లడవుతుంది. ఈ సిరీస్‌లోని ఇతర మోడళ్ల మాదిరిగానే ఇది స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఎస్-25 ఎడ్జ్ 12 జీబీ+ 512 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ కేవలం 5.8 ఎంఎం సన్నని డిజైన్‌తో ఉంటుంది. ఇది బలమైన 3,900 ఎంఏహెచ్ బ్యాటరీతో 25 వాట్స్ ఫాస్ట్ వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్ రెండింటికీ మద్దతు ఇస్తుంది. అదనంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 7 ఆధారంగా వన్ యూఐ15లో రన్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి