Samsung Galaxy F12: వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ సామ్‌సంగ్ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో మార్కెట్లోకి గ్యాలక్సీ ఎఫ్12 ఫోన్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 5న తొలి సేల్‌ను ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌లో నిర్వహించింది. కేవలం రూ. పదివేలకే అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌ను మొదటి సేల్‌లో సొంతం చేసుకోలేకపోయారా.? అయితే మీ కోసమే సామ్‌సంగ్ రెండో సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 12న మరో సేల్‌ను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు, ఫోన్‌ను ఎలా సొంతం చేసుకోవాలో ఓ లుక్కేయండి..
కెమెరా విషయంలో సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్12 ఓ సంచలనం సృష్టించనుంది. 48 మెగా పిక్సెల్ అద్భుతమైన ఫొటోలను అందించనుంది. అత్యంత స్పష్టంగా, బ్లర్రీ ఇమేజ్‌లు లేకుండా ఫొటోలు ఎంచక్కా తీసుకోవచ్చు. ఇక 48 మెగా పిక్సెల్స్‌తో జూమ్ చేసి తీసినా కూడా ఫొటో క్లారిటీ ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం. నైట్ మోడ్‌లోనూ అద్భుతంగా ఫొటోలు తీసుకోగలగడం ఈ ఫోన్ మరో ప్రత్యేకత.
Samsung Galaxy F12లో అదిరిపోయే మరో ఫీచర్ దీని డిస్‌ప్లే. 6.5″ HD+ Infinity V Display, super smooth 90Hz refresh rateతో వస్తోన్న ఈ స్మార్ట్ ఫోన్ చూపు తిప్పుకోనివ్వదు. 90హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌తో స్క్రీన్ క్లారిటీ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఓటీటీ వేదికగా వచ్చే హై క్వాలిటీ వీడియోలను ఆస్వాదించొచ్చు.
స్మార్ట్ ఫోన్‌లలో గేమ్స్ ఆడే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఇందులో ఉన్న 8NM Exynos 850 ప్రాసెసర్‌తో గేమ్స్ ఆడుకోవడానికి ఎంతో వీలుగా ఉంటుంది.
ఇక ధర విషయంలో కూడా ఈ ఫోన్ సంచనం సృష్టించింది. సమాచారం ప్రకారం Samsung Galaxy F12 ‘ఫుల్ ఆన్ ఫ్యాబ్’ కేవలం రూ.10 వేలకే అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే మరో రూ. 1000 క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కూడా ఉంది. ఈ లెక్కన చూస్తే అత్యంత తక్కువ ధరకు ఇన్ని ఫీచర్లతో వస్తోన్న తొలి స్మార్ట్ ఫోన్ ఇదే అనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.
ప్రస్తుతం ఈ ఫోన్‌ను సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లోనూ అందుబాటులో ఉంచారు. ఈ కింది లింక్‌ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు.
Also Read: Megha Engineering: మరో ఘనత సాధించిన ‘మేఘా’.. స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్ రిగ్గులు..
Asteroid:భూమి వైపు దూసుకొస్తున్న మరో భారీ గ్రహశకలం..NASA ఏం చెప్పిందంటే?