Smartphone: ఊహకందని డిస్కౌంట్‌.. స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ. 10 వేల తగ్గింపు. 64 ఎంపీ కెమెరాతో పాటు

|

May 01, 2023 | 9:47 PM

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మీ ఇటీవల మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ జీటీ నియో 3టీ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ సేల్‌ ఇప్పటికే ప్రారంభమైంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తున్నారు. ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్‌తో ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు...

Smartphone: ఊహకందని డిస్కౌంట్‌.. స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ. 10 వేల తగ్గింపు. 64 ఎంపీ కెమెరాతో పాటు
Realme Gt Neo 3t
Follow us on

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మీ ఇటీవల మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ జీటీ నియో 3టీ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ సేల్‌ ఇప్పటికే ప్రారంభమైంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తున్నారు. ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్‌తో ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌ కార్ట్‌ తాజాగా బిగ్‌ సేవింగ్‌ డేస్‌ – 2023 పేరుతో సేల్‌ను తీసుకురానుంది. ఇందులో భాగంగానే రియల్‌మీ జీటీ నియో 3టీ పై డిస్కౌంట్‌ను అందిస్తోంది.

గతేడాది సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. రూ. 29,999గా ఉంది. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ. 10,000 తగ్గింపుతో రూ. 19,999కే సొంతం చేసుకునే వెసులుబాటును కల్పించింది. వీటితో పాటు పలు క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే క్యాష్‌ బ్యాక్‌ సైతం అందిస్తున్నారు. ఈ ఆఫర్‌ కొద్ది కాలం మాత్రమే అందుబాటులో ఉండనుంది.

ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. GT నియో 3Tలో 6.62 ఇంచెస్‌ ఈ4 అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్నాప్‌డ్రాగన్ 870 SoC ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్‌తో కూడిన రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 80W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం. 12 నిమిషాల్లో ఫోన్‌ను 50 ఛార్జ్‌ కావడం ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..