ఆధునిక కాలంలో.. శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రోజురోజుకూ పెను మార్పులు సంభవిస్తున్నాయి. అభివృద్ధి అనేది.. ఇప్పుడు శాస్త్రసాంకేతిక రంగాలు లేకుండా అస్సలు ఊహించలేం.. వాటితోనే అసాధ్యం అనుకున్నవి సైతం సుసాధ్యం అవుతున్నాయి. శరవేగంగా మారుతోన్న ఈ ఆధునిక కాలంలో ఎన్నో నూతన ఆవిష్కరణలు ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. యంత్రాలు లేకుండా ఇప్పుడు సంస్థల అభివృద్ది.. పునర్నిర్మాణం కష్టమవుతోంది. ఇప్పుడు ప్రపంచమంతా యంత్రాలపైనే ఆధారపడి నడుస్తోంది.
దాదాపు అన్ని రంగాలూ ఆటోమిషన్‌కు మారుతున్నాయి. వంద మంది చేసే పనిని ఓ యంత్రం అనుకున్న సమయానికంటే అతి తక్కువ వ్యవధిలోనే పూర్తి చేస్తోంది. దీనివల్ల సమయం ఆదాతోపాటు.. ఖర్చు కూడా భారీగా తగ్గుతోంది. అందుకే.. చాలా ప్రాంతాల్లో రోబోలు రంగప్రవేశం చేసి తెగ ఆకట్టుకుంటున్నాయి. రెస్టారెంట్లు, మాల్స్ తోపాటు.. రక్షణ రంగాల్లో కూడా రోబోలు సేవలందిస్తున్నాయి. ప్రస్తుతం సాంకేతిక రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో అన్ని పనులనూ ఈ రోబోలు చక్కబెట్టేలా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు.
తాజాగా ఆధ్యాత్మిక రంగంలోకీ కూడా రోబోలు అడుగుపెట్టాయి. తమిళనాడు వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో దసరా రోజు జరిగిన వేడుకల్లో రోబోలు పౌరోహిత్యానికి నాంది పలికాయి. వెల్లూరులోని ఈ ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలో రోబోలు దసరా పండుగ రోజున ఆయుధ పూజ నిర్వహించి అందరినీ తెగ ఆకట్టుకున్నాయి. ఒక రోబో గంట మోగించగా.. మరో రోబో దుర్గా మాతకు హారతి సమర్పించింది.
రోబోలు పూజ చేస్తున్న వీడియో చూడండి..
Innovation at it’s best & first of its kind @ VIT when the #robots did end-to-end Puja #AyudhaPoojai#Robots#Robotics#Automation pic.twitter.com/NkeLemYARG
— VIT University (@VIT_univ) October 4, 2022
ఈ రోబోల పూజా కార్యక్రమం అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. దుర్గామాతకు హారతి ఇచ్చిన తర్వాత భక్తులు ఆ రోబో వద్దకు వెళ్లి హారతి తీసుకున్న వీడియోలను వీఐటీ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇవి నెట్టింట వైరల్ గా మారాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం..