పెరుగుతోన్న పోటీనీ తట్టుకునే క్రమంలో కంపెనీలు రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కామర్స్ సంస్థలు మొదలు, టెలికాం కంపెనీల వరకు యూజర్లకు మంచి ఆఫర్స్‌ను అందించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్-ఐడియా యూజర్లకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ఉచితంగా ఇంటర్‌నెట్ డేటా పొందే అవకాశాన్ని కల్పించింది. వొడాఫోన్-ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందొచ్చు.
రిపబ్లిక్‌డే సందర్భంగా తీసుకొచ్చిన ఈ ఆఫర్‌లో భాగంగా ఈ ఆఫర్‌ను అందిస్తున్నారు. రూ. 199 నుంచి రూ. 299 మధ్య ప్లాన్స్‌లో ఏ రీఛార్జ్ చేసుకున్నా ఆ ప్లాన్ ప్రయోజనాలతో పాటు యూజర్లు అదనంగా 2 జీబీ డేటా పొందొచ్చని వొడాఫోన్-ఐడియా ప్రకటించింది. ఇక రూ. రూ.299 లేదా అంతకన్నా ఎక్కువ ప్లాన్స్‌తో రీచార్జ్ చేసిన యూజర్లకు 5జీబీ ఉచిత డేటాను ఉచితంగా అందిస్తారు.
అయితే కేవలం వీఐ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకునే వారికి మాత్రమే ఈ ప్రయోజనాలు లభిస్తాయి. వేరే ఏ ఇతర యాప్‌లతో చేసినా అదనపు డేటా లభించదు. ఇదిలా ఉంటే ఉచితంగా వచ్చిన ఈ అదనపు డేటా వ్యాలిడిటీ 28 రోజులు ఉంటుంది. ఇక ఈ ఆఫర్ ఫిబ్రవరి 7వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. అంటే ఫిబ్రవరి 7వ తేదీలోపు రీఛార్జ్ చేసుకున్న వారు మాత్రమే ఈ బెనిఫిట్స్ పొందుతారని కంపెనీ తెలిపింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..