Cleaning Tips: మీ వంట గదిలో సిలిండర్‌ తుప్పు మరకలు పోవడం లేదా..? ఇలా చేయడం నిమిషాల్లో మాయం

|

Sep 28, 2022 | 11:13 AM

ఇక సాధారణంగా ప్రతి ఇండ్లలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ ఉంటుంది. ఈ సిలిండర్ గట్టి ఇనుముతో తయారు చేయబడి ఉంటుంది. ఈ సిలిండర్‌ను వంటగదిలో ఎక్కడ ఉంచినా మురికి మరకలు పడటం మీరు గమనించి ఉంటారు. సిలిండర్‌ ఇనుముతో తయారు చేసి ఉండటం కారణంగా నేలపై ఉంచడంతో తుప్పు మరకలు అవుతుంటాయి.

Cleaning Tips: మీ వంట గదిలో సిలిండర్‌ తుప్పు మరకలు పోవడం లేదా..? ఇలా చేయడం నిమిషాల్లో మాయం
Gas Cylinder Stains
Follow us on

మన ఇండ్లో నేలపై రకరకాల మరకలు కావడం చూస్తూనే ఉంటాము. వాటిని తొలగించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము. ఏవేవో వేసి నేలపై పడిన మరకలను తొలగిస్తుంటాము. ఇక సాధారణంగా ప్రతి ఇండ్లలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌ ఉంటుంది. ఈ సిలిండర్ గట్టి ఇనుముతో తయారు చేయబడి ఉంటుంది. ఈ సిలిండర్‌ను వంటగదిలో ఎక్కడ ఉంచినా మురికి మరకలు పడటం మీరు గమనించి ఉంటారు. సిలిండర్‌ ఇనుముతో తయారు చేసి ఉండటం కారణంగా నేలపై ఉంచడంతో తుప్పు మరకలు అవుతుంటాయి. ఈ సిలిండర్ మరకల కారణంగా వంటగది నేల మురికిగా కనిపిస్తుంది. సిలిండర్ మరకలను శుభ్రం చేయడం పెద్ద పని. అయితే కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగించడం ద్వారా ఈ మరకలను సులభంగా శుభ్రం చేయవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.

  1. కిరోసిన్: కిరోసిన్ సహాయంతో నేలపై సిలిండర్ మరకలను సులభంగా శుభ్రం చేయవచ్చు. దీని కోసం మీరు 1 కప్పు నీటిలో 2 నుండి 3 స్పూన్ల కిరోసిన్ కలిపి ఒక ద్రావణాన్ని సిద్ధం చేయాలి. ఇప్పుడు ఈ ద్రావణాన్ని ఎక్కడైతే మరకలు అయ్యాయో వాటిపై వేసి ప్లై చేసి 5-10 నిమిషాలు అలాగే ఉంచండి. దీని తరువాత స్క్రబ్ సహాయంతో నేలను శుభ్రం చేయండి.
  2. నిమ్మకాయ బేకింగ్ సోడా..: మొండి సిలిండర్ మరకలను తొలగించడానికి మీరు బేకింగ్ సోడా, నిమ్మరసాన్ని ఉపయోగించవచ్చు. దీని కోసం 2 టీస్పూన్ల బేకింగ్ సోడా, ఒక నిమ్మకాయ రసాన్ని 1 కప్పు నీటిలో కరిగించండి. ఈ ద్రావణాన్ని టైల్స్‌పై పోసి స్క్రబ్ సహాయంతో రుద్దండి. కాసేపట్లో నేల పూర్తిగా శుభ్రం అవుతుంది.
  3. ఉప్పు, వెనిగర్: నేలపై ఉన్న సిలిండర్ మరకలను వెనిగర్ సహాయంతో కూడా శుభ్రం చేయవచ్చు. దీని కోసం ఒక కప్పు వెనిగర్‌లో ఒక టీస్పూన్ ఉప్పు వేసి ద్రావణాన్ని తయారు చేయండి. ఇప్పుడు బ్రష్ లేదా స్క్రబ్ సహాయంతో రుద్దండి. సిలిండర్ మరకలు కాసేపట్లో మాయమవుతాయి.
  4. టూత్ పేస్టు: మీ వంటగదిలో తెల్లటి టైల్స్ ఉంటే మీరు దానిని శుభ్రం చేయడానికి టూత్‌పేస్ట్‌ను కూడా ఉపయోగించవచ్చు. దాని సహాయంతో సిలిండర్ మురికి మచ్చలు చాలా వరకు శుభ్రం చేయబడతాయి. దీని కోసం కొద్దిగా పేస్ట్ తీసుకొని మరకపై రాయండి. ఇప్పుడు స్క్రబ్ సహాయంతో రుద్దండి ఆపై నీటితో శుభ్రం చేసుకోండి.
  5. ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి