టెలికం రంగంలో ఓ సంచలనంలా దూసుకొచ్చింది జియో. రిలయన్స్ సంస్థకు చెందిన ఈ సంస్థ తక్కువ ధరలో 4జీ నెట్‌ను పరిచయం చేసి యూజర్లను పెద్ద ఎత్తున ఆకర్షించింది. ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీనిచ్చి కొత్త వినియోగదారులను తనవైపు తిప్పుకుంది. ఇక రకరకాల రీఛార్జ్ ప్లాన్స్‌ను పరిచయం చేస్తూ యూజర్లను చేజారి పోకుండా జాగ్రత్తపడుతోంది.
ఈ క్రమంలోనే ఓటీటీ లవర్స్‌ని ఆకర్షించేందుకు జియో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఓటీటీ సబ్‌స్క్రైబర్స్ భారీగా పెరుగుతున్నారు. కరోనా తర్వాత ఓటీటీల్లోనే సినిమాలు చూసే వారి సంఖ్య సైతం పెరుగుతోంది. దీంతో ఓటీటీ మార్కెట్ రోజురోజుకీ విస్తరిస్తోంది. సరిగ్గా టెలికాం కంపెనీలు దీనిని క్యాష్ చేసుకుంటున్నాయి. రీచార్జ్ ప్లాన్స్‌లో ఓటీటీ సేవలను కలిపి అందిస్తున్నాయి. తాజాగా రిలయన్స్ జియో.. నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి రెండు రీచార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ను యూజర్లు ఉచితంగా వీక్షించే అవకాశం పొందొచ్చు. ఇంతకీ ఆ రీచార్జ్ ప్లాన్స్ ఏంటి..? వాటి వల్ల కలిగే ప్రయోజనం ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..
జియో అందిస్తోన్న తొలి రీఛార్జ్ ప్లాన్ రూ. 1099. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు రోజుకు 2జీబీ బడేటా లభిస్తుంది. అలాగే ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న యూజర్లు నెట్‌ఫ్లిక్స్ మొబైల్ వెర్షన్‌ను ఉచితంగా పొందొచ్చు. ఇక వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా ప్రస్తుతానికి అన్‌లిమిటెడ్ మొబైల్ డేటాను పొందొచ్చు. వీటితో పాటు అదనంగా రోజుకు 100 ఉచిత మెసేజ్‌లు, జియో యాప్స్‌ను యాక్సెస్ చేసుకునే అవకాశం కల్పిస్తారు.
ఇక జియో అందిస్తోన్న రెండో ప్లాన్‌రూ. 1499. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకునే రోజుకు 3 జీబీ డేటా లభిస్తుంది. వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా ప్రస్తుతం 5జీ డేటా అందిస్తారు. నెట్‌ఫ్లిక్స్ మొబైల్ వెర్షన్‌ను ఉచితంగా పొందొచ్చు. ఇక 84 రోజులు వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు జియో యాప్స్ యాక్సెస్ పొందొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..