Reliance Jio: జియో యూజర్లకు బంపరాఫర్‌.. ఉచితంగా నెటిఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందే అవకాశం..

|

Jul 05, 2022 | 2:51 PM

Reliance Jio: ప్రస్తుతం ఓటీటీల సందడి పెరుగుతోంది. థియేటర్లలో విడుదలైన సినిమాలు నెల తిరగకుండానే ఓటీటీల్లో ప్రత్యక్షకావడం, ఓటీటీకే ప్రత్యేకమైన కంటెంట్‌పై క్రియేటర్లు దృష్టి సారించడంతో...

Reliance Jio: జియో యూజర్లకు బంపరాఫర్‌.. ఉచితంగా నెటిఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందే అవకాశం..
Follow us on

Reliance Jio: ప్రస్తుతం ఓటీటీల సందడి పెరుగుతోంది. థియేటర్లలో విడుదలైన సినిమాలు నెల తిరగకుండానే ఓటీటీల్లో ప్రత్యక్షకావడం, ఓటీటీకే ప్రత్యేకమైన కంటెంట్‌పై క్రియేటర్లు దృష్టి సారించడంతో ఓటీటీ బిజినెస్‌ మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లు సాగుతోంది. ఈ క్రమంలోనే ఓటీటీల మధ్య పోటీ కూడా పెరుగుతోంది. దీంతో ఎలాగైనా యూజర్లను ఆకర్షించే పనిలో పడ్డ సంస్థలు.. రకరకాల ఆఫర్లను అందిస్తున్నాయి. టెలికాం కంపెనీలతో ఒప్పందం చేసుకొని ఓటీటీ సేవలను ప్రజలకు అందిస్తోంది.

తాజాగా రిలయన్స్‌ జియో ఇలాంటి ఓ బెస్ట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. జియో పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్‌లతో పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందే అవకాశం కల్పించింది. రూ 399, రూ 599, రూ 799, రూ 999, రూ 1499 విలువైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల‌పై జియో ఉచిత నెట్‌ఫ్లిక్స్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను అందిస్తోంది. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌లో ఇంటర్నెట్‌ డేటాతో పాటు జియో టీవీతో పాటు ఇతర జియో యాప్స్‌ను యూజర్లు ఉచితంగా పొందొచ్చు.

ఇదిలా ఉంటే జియో కేవలం పోస్ట్‌ పెయిడ్‌ మాత్రమే కాకుండా ప్రీపెయిడ్‌ యూజర్లకు సైతం ఉచితంగా ఓటీటీ అందిస్తోంది. అయితే ప్రీపెయిడ్‌ ఆఫర్‌లో డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్‌ ప్రైం వంటి సబ్‌స్క్రిప్షన్‌లను మాత్రమే అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌ను కేవలం పోస్ట్‌ పెయిడ్‌ సేవలకు మాత్రమే ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..