Redmi Note 15 Pro: ఇండియాలో లాంచ్‌కి రెడీగా ఉన్నా క్రేజీ ఫోన్‌! ధర ఎంతో తెలుసా..?

Redmi Note 15 Pro Plus 5G జనవరి 29న ఇండియాలో అధికారికంగా లాంచ్ కానుంది. అయితే లాంచ్‌కు ముందే ఈ ఫోన్ ధర లీకైంది. ఈ ఫోన్‌పై ప్రీ - బుకింగ్ ఆఫర్‌లలో ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ లభించే అవకాశం ఉంది.

Redmi Note 15 Pro: ఇండియాలో లాంచ్‌కి రెడీగా ఉన్నా క్రేజీ ఫోన్‌! ధర ఎంతో తెలుసా..?
Redmi Note 15 Pro Plus 5g

Updated on: Jan 28, 2026 | 8:20 AM

ఇండియాలో Redmi Note 15 Pro Plus 5Gని అధికారికంగా లాంచ్‌ చేయడానికి కంపెనీ సిద్ధమైంది. అయితే లాంచ్‌ కంటే ముందే ఆ ఫోన్‌ ధర లీకైంది. 200MP కెమెరాను కలిగి ఉన్న రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ జనవరి 29న ఇండియాలో అఫిషీయిల్‌గా లాంచ్ కానుంది. దానితో పాటు Redmi Note 15 Pro కూడా భారత మార్కెట్లోకి రావచ్చు. రెడ్‌మీ ఇటీవలే తన స్వదేశీ మార్కెట్ అయిన చైనాలో రెండు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇండియాలో జరగనున్న లాంచ్ ఈవెంట్‌లో కంపెనీ ప్రీ-బుకింగ్ ఆఫర్‌లను ప్రకటించే అవకాశం ఉంది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వివరాలను పంచుకున్న టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం.. Redmi Note 15 Pro Plus 5G ధర ఇండియాలో రూ.38,999 నుండి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. బేస్ వేరియంట్‌లో 8GB RAM, 256GB స్టోరేజ్ ఉండవచ్చు. ప్రీ-బుకింగ్ ఆఫర్‌లో భాగంగా రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుతో పాటు ఒక సంవత్సరం పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను అందించే అవకాశం ఉంది. కొనుగోలుదారులు ఉచిత రెడ్‌మి వాచ్ మూవ్‌ను కూడా పొందవచ్చు. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999 ఉంటుందని, 12GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ ధర రూ.44,999 ఉండవచ్చని అంచనా.

స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

Redmi Note 15 Pro Plus 5G క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్‌తో వస్తోంది. ఇది భారీ గేమింగ్ సమయంలో థర్మల్ పనితీరును మెరుగుపరచడం లక్ష్యంగా ఐస్-షీల్డ్ సర్క్యులేటింగ్ కూలింగ్ పంప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6,500mAh బ్యాటరీ కలిగి ఉంది. చైనాలో ఈ ఫోన్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో లాంచ్‌ అయింది. 200MP ప్రైమరీ కెమెరా, అదనంగా రెండు 50MP సెన్సార్లు ఉండవచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉండవచ్చు.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి