Realme GT3: కేవలం 10 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ అయ్యే ఫోన్ ఇదే.. ప్రపంచంలోనే దీనిని మించింది లేదు.. వివరాలు ఇవి..

|

Mar 04, 2023 | 8:00 PM

రియల్‌మీ సరికొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనిలోని ప్రత్యేకత ఎంటో తెలుసా? ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా చార్జ్ అవుతుంది. ఎంత సమయంలోనో తెలుసా? కేవలం పదంటే పది నిమిషాల్లోనే ఇది ఫుల్ చార్జ్ అవుతుంది.

Realme GT3: కేవలం 10 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ అయ్యే ఫోన్ ఇదే.. ప్రపంచంలోనే దీనిని మించింది లేదు.. వివరాలు ఇవి..
Realme Gt3
Follow us on

స్మార్ట్ ఫోన్లు వచ్చిన కొత్తలో చార్జ్ సమయం చాలా ఎక్కువ ఉండేది. ఫుల్ చార్జ్ అవడానికి నాలుగైదు గంటలు పట్టేది. ఈ క్రమంలో కంపెనీలు ఆ సమయాన్ని తగ్గించుకుంటూ వచ్చాయి. కొన్నేళ్లుగా ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్లతో ఫోన్లు వస్తున్నాయి. ఎంత ఫాస్ట్ చార్జర్ అయినా సున్నా నుంచి ఆ ఫోన్ ఫుల్ చార్జ్ అవడానికి కనీసం గంట నుంచి రెండు గంటలు పడుతుంది. ఈ క్రమంలో మొబైల్ తయారీ దిగ్గజం రియల్ మీ సరికొత్త ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనిలోని ప్రత్యేకత ఎంటో తెలుసా? ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా చార్జ్ అవుతుంది. ఎంత సమయంలోనో తెలుసా? కేవలం పదంటే పది నిమిషాల్లోనే ఇది ఫుల్ చార్జ్ అవుతుందని ఆ ఫోన్ తయారీ దారు రియల్ మీ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

రియల్‌మీ జీటీ3 పేరుతో..

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2023లో రియల్‌మీ జీటీ సిరీస్‌లో కొత్త ఫోన్ ని తీసుకొచ్చింది. రియల్‌మీ జీటీ3 పేరుతో ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫాస్టెస్ట్ ఛార్జింగ్ ఫోన్‌గా మార్కెట్లోకి వచ్చిన ఈ రియల్‌మీ జీటీ3 ఫోన్ 240 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ సౌకర్యం వల్ల 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ చార్జింగ్ పెట్టిన 10 నిమిషాల్లోనే ఫుల్ అవుతుందని వెల్లడించింది. ఇంత వేగంగా చార్జ్ చేయగలిగే సామర్థ్యం ఒక్క తమ ఫోన్ కే ఉందని పేర్కొంది. రియల్‌మీ జీటీ 3 ఐదు రకాల ర్యామ్ స్టోరేజీ వేరియంట్లలో వస్తుంది. 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ, 16జీబీ+256జీబీ, 16జీబీ+512జీబీ, 16బీజీ+1టీబీ మార్కెట్లోకి తీసుకొచ్చింది రియల్‌మీ సంస్థ. అయితే ఈ రియల్‌మీ జీటీ3 ఫోన్ ధర ఎంత అనేది కంపెనీ వెల్లడించలేదు. కానీ భారత మార్కెట్లో రియల్‌మీ జీటీ3 ఫోన్ ధర రూ.53 వేలు నుంచి ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, కస్టమర్లకు అందుబాటులోకి ఎప్పుడు తీసుకొస్తారనేది వెల్లడించారు. గతేడాది ఏప్రిల్‌లో రియల్‌మీ జీటీ2ను భారత్‌ మార్కెట్లోకి తీసుకొచ్చింది.

రియల్‌మీ జీటీ3 స్పెసిఫికెషన్స్..

ఇక స్పెసిఫికేషన్ల వివరాలకు వస్తే ఆండ్రాయిడ్ 13తో రియల్‌మీ యూఐ 4.0 కలిగి ఉంది. 6.74 అంగుళాల 1.5కె అమోల్డ్, 144హెర్జ్ రీఫ్రెషింగ్ రేటుతో కూడిన డిస్‌ప్లే ఉంటుంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8+ జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది. ఫోన్ వెనకాల 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సార్, 8ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మైక్రో సెన్సార్స్ ఉంటాయి. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనికి 240వాట్ల సూపర్‌వూక్ ఛార్జింగ్ సపోర్ట్,
ఫోన్ వెనుక వైపు ఆర్‌జీబీ ఎల్‌ఈడీ ప్యానెల్ 25 రంగులు వెలువరిస్తుంది. కాల్స్, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఎల్ఈడీ అలర్ట్ వస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..