Realme Laptop: మీ ల్యాప్‌టాప్‌లను బద్దలు కొట్టండని చెబుతోన్న రియల్‌మీ.. సరికొత్త ప్రచారానికి తెర తీసిన టెక్‌ దిగ్గజం.

|

Aug 15, 2021 | 8:34 AM

Realme Laptop: ప్రస్తుతం మార్కెట్లో పోటీ తీవ్రంగా పెరిగింది. ఒక సంస్థను మించి మరో సంస్థ ఆఫర్లు, ఫీచర్లతో వినియోగదారులను అట్రాక్ట్‌ చేస్తున్నాయి. ఇక వస్తువును తయారు చేయడంలో...

Realme Laptop: మీ ల్యాప్‌టాప్‌లను బద్దలు కొట్టండని చెబుతోన్న రియల్‌మీ.. సరికొత్త ప్రచారానికి తెర తీసిన టెక్‌ దిగ్గజం.
Realme
Follow us on

Realme Laptop: ప్రస్తుతం మార్కెట్లో పోటీ తీవ్రంగా పెరిగింది. ఒక సంస్థను మించి మరో సంస్థ ఆఫర్లు, ఫీచర్లతో వినియోగదారులను అట్రాక్ట్‌ చేస్తున్నాయి. ఇక వస్తువును తయారు చేయడంలో ఎంత క్రియేటివిటీని చూపిస్తున్నాయో దానిని ప్రమోట్‌ చేయడంలోనూ అంతే క్రియేటివిటీని ప్రదర్శిస్తున్నాయి. కొత్త కొత్త ఐడియాలతో తమ వస్తువులను ప్రమోట్‌ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ టెక్‌ దిగ్గజం రియల్‌మీ ప్రకటనలో మరో సరికొత్త ట్రెండ్‌కు నాంది పలికింది. వివరాల్లోకి వెళితే.. రియల్‌ మీ తొలిసారిగా ల్యాప్‌టాప్‌లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే తొలి ల్యాప్‌టాప్‌ను ఆగస్టు 18న విడుదల చేయనుంది.

ఈ క్రమంలోనే ప్రారంభ కార్యక్రమానికి ప్రముఖ టెక్‌ నిపుణులను ఆహ్వానించింది. అయితే రియల్‌ మీ ఆహ్వానం పలికిన తీరు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హైదరాబాద్‌కు చెందిన టెక్నికల్‌ నిపుణుడు రంజిత్‌కు రియల్‌మీ ఆహ్వాన పత్రికను పంపించింది. ఇందులో భాంగగా రంజిత్‌కు ఇన్‌విటేషన్‌ లెటర్‌తో పాటు బాష్‌ కంపెనీకి చెందిన ఓ టూల్‌ కిట్‌ పంపించింది. అందులో స్క్రూ డ్రైవర్‌తో పాటు రాడ్‌ వంటి వస్తువులు ఉన్నాయి. ఇక లెటర్‌లో రియల్‌మీ సంస్థ.. ‘ఈ టూల్‌ కిట్‌లో నుంచి మీకు నచ్చిన వస్తువును తీసుకొని మీ పాత జనరేషన్‌, బోరింగ్‌, బరువైన, లావుగా ఉండే ల్యాప్‌టాప్‌ను బద్దలు కొట్టండి’ అంటూ రాసుకొచ్చింది. దీనర్థం రియల్‌మీ తీసుకురానున్న ఈ కొత్త ల్యాప్‌ ట్యాప్‌.. ప్రస్తుతం ఉన్న వాటికంటే అధునాతన ఫీచర్లతో రానుందని చెప్పకనే చెప్పింది రియల్‌మీ. ఇక విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా పంచుకున్న రంజిత్‌.. ‘ఒక ప్రొడక్ట్‌ను ఈ విధంగా లాంచ్‌ చేయడం నేను ఎప్పుడూ చూడలేదు.’ అంటూ రాసుకొచ్చాడు. రియల్‌మీ తీసుకొచ్చిన ఈ నయా అడ్వటైజింగ్‌ ట్రెండ్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Also Read: Neem Face Pack: అందమైన ముఖం కోసం వేప ఫేస్ ప్యాక్.. ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..!

Andhra Pradesh: పెద్ద చదువులు చదివారు.. మూఢ నమ్మకాల మత్తులో తప్పు చేశారు.. ఆఖరికి అడ్డంగా బుక్కయ్యారు..

Whatsapp Scam: వాట్సాప్‌ మాటున పొంచి ఉన్న ఆన్‌లైన్‌ మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు.