అతి తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్‌.. మార్కెట్‌లోకి POCO నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌!

ప్రతిస్మార్ట్‌ పోన్‌ కంపెనీ వినియోగదారుల అభిరులకు అనుగునంగా.. తమ ఫోన్‌లను అప్‌గ్రేడ్‌ చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తూ ఉంటాయి. తాజాగా Poco కూడా తన M-సిరీస్‌లో భాగంగా అదిరిపోయే ఫీచర్స్‌తో కొత్త బడ్జెట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్‌ చేసింది. అయితే దాని ఫీచర్స్‌ ఏంటి, ధర ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అతి తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్‌.. మార్కెట్‌లోకి POCO నుంచి మరో బడ్జెట్‌ ఫోన్‌!
Poco M7 Plus 5g

Edited By:

Updated on: Aug 15, 2025 | 5:55 PM

POCO తన కొత్త స్మార్ట్‌ఫోన్ POCO M7 ప్లస్‌ను బుధవారం భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. ఈ బడ్జెట్‌ ఫోన్‌లో పోకో అదిరిపోయే ఫీచర్స్‌ను యాడ్‌ చేసింది. ఈ ఫోన్‌లో 7,000mAh సిలికాన్-కార్బన్ భారీ బ్యాటరీ ఉంది. ఇప్పటివరకు వచ్చిన బడ్జెట్‌ ఫోన్లలో ఇదే అతిపెద్ద బ్యాటరీ అని కంపెనీ చెబుతోంది. ఇందులో ఇంకో ఫీచర్‌ ఏంటంటే.. దీని బ్యాటరీ నుంచి రివర్స్ ఛార్జింగ్‌ కూడా చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో ఇప్పటివరకు పోకో ఫోన్‌లలో అందుబాటులో లేని FHD+ డిస్‌ప్లేను పరిచయం చేసినట్టు POCO పేర్కొంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్‌ సెంటర్ పంచ్ హోల్ కటౌట్ పాటు, Qualcomm Snapdragon 6s Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది.

POCO M7 Plus 5G స్పెసిఫికేషన్స్‌

డిస్ప్లే : POCO M7 Plus 5G 6.9-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. స్క్రీన్ గరిష్టంగా 550 Nits బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇది హ్యాండ్‌సెట్ Qualcomm Snapdragon 6s Gen 3 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.

స్టోరేజ్: ఈ ఫోన్‌ 6GB RAM, 8GB RAM వంటి రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 6GB ఫోన్‌లో 128GB స్టోరేజ్‌ ఉంటుంది. దీన్ని మైక్రో SD కార్డ్ సహాయంతో 1TB వరకు పెంచుకొవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా హైపర్ OS పై పనిచేస్తుంది. దీనిలో డ్యూయల్ సిమ్ కార్డు సపోర్ట్ ఉంటుంది.

కెమెరా: ఇక కెమెరా విషయానికి వస్తే ఇందులో 50MP ప్రైమరీ రియర్ కెమెరా, సెకండరీ కెమెరాలు ఉంటాయి. 8MP ఫ్రంట్ కెమెరా, గరిష్టంగా 1080p/30fps వీడియో రికార్డింగ్ చేయొచ్చు.

బ్యాటరీ: ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఈ ఫోన్‌ 7,000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీతో వస్తుంది. పోకో నుంచి వచ్చన బడ్జెట్‌ ఫోన్‌లలో ఇదే తొలిసారి. ఇది 33W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది, ఇందులో 18W రివర్స్ వైర్డ్ చార్జింగ్ అప్షన్ కూడా ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది.

ధర: ఇక ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. ఇది రెండు వేరియంట్లలో మార్కెట్‌లోకి వచ్చింది. ఒకటి 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ దీని ధర రూ. 13,999. ఇంకోటి 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999.

కలర్స్‌: ఇక కలర్స్‌ విషయానికి వస్తే.. POCO M7 Plus 5G ని Chrome Silver, Aqua Blue, Carbon Black రంగులలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రెండు కాన్ఫిగరేషన్లలో లాంచ్ చేయబడింది.

ఆఫర్స్‌: ఆగస్టు 19 నుండి మీరు దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్‌గా, కంపెనీ HDFC, ICICI బ్యాంక్, SBI కార్డులపై రూ. 1000 తగ్గింపును అందిస్తోంది. లేదా మీరు అదనంగా రూ. 1000 ఎక్స్ఛేంజ్‌ను కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ నో-కాస్ట్ EMIలో కూడా అందుబాటులో ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.