Netflix Gaming: ఓటీటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నెట్‌ఫ్లిక్స్. భారీ యాక్షన్ చిత్రాలను ఓటీటీ కోసమే ప్రత్యేకంగా నిర్మించిన ఘనత ఒక్క నెట్‌ఫ్లిక్స్‌కే దక్కిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అమెరికాకు చెందిన ఈ సంస్థ తెలుగులో వెబ్ సిరీస్‌లోను తెరకెక్కించిందంటేనే నెట్‌ఫ్లిక్స్ నెట్‌వర్క్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఓటీటీ వేదికగా ఎంటర్‌టైన్‌మెంట్ అందించిన నెట్‌ఫ్లిక్స్ తాజాగా గేమింగ్ సేవలను కూడా అందివ్వనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే గేమ్ స్ట్రీమింగ్ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తు్న్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సేవలను నెట్‌ఫ్లిక్స్ తన యాప్‌లో కాకుండా ప్రత్యేకంగా అందించనుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే గేమింగ్ రంగంలో ముందున్న గూగుల్ స్టాడియా, ఎక్స్‌బాక్స్ క్లౌడ్ తరహాలో ఈ కొత్త గేమింగ్ సేవలు ఉండనున్నాయి. ఇక ఈ గేమింగ్ సేవలను యూజర్లు క్లౌడ్ సర్వీసెస్ ద్వారా ఆన్‌లైన్‌లోనే వినియోగించుకోవచ్చు. డాక్యుమెంటరీస్, స్టాండ్-అప్ స్పెషల్స్ తరహాలోనే గేమింగ్ సేవలు కూడా ప్రత్యేక కేటగిరీలో అందించనున్నారు. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్ కీలక అడుగు వేసినట్లు తెలుస్తోంది. గేమ్ స్ట్రీమింగ్ సేవలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని ఆకర్షించే విధంగా ఉండేందుకు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రముఖ వీడియో గేమ్స్ డెవలపింగ్ సంస్థ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ (ఈఏ)కు చెందిన ఉద్యోగి.. మైక్ వెర్డూ అనే గేమ్ డెవలపర్‌ను నియమించుకున్నట్లు సమాచారం. వచ్చే ఈ ఏడాది ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ ప్రయత్నాలు చేస్తోంది.
Ira Khan: బాయ్ ఫ్రెండ్‌తో రచ్చ చేస్తున్న అమీర్ ఖాన్ కూతురు.. నెట్టింట వైరల్ అవుతోన్న ఫొటోలు..