టెక్నాలజీ మరింతగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా మొబైల్ రంగం మరింతగా దూసుకుపోతోంది. వివిధ కంపెనీల నుంచి కొత్త కొత్త మొబైళ్లు, ట్యాబ్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక వన్ ప్లస్ నుంచి మొదటి సారిగా ట్యాబ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీని వన్‌ప్లస్ క్లౌడ్ 11 ఈవెంట్‌లో వన్‌ప్లస్ ప్యాడ్ పేరుతో ట్యాబ్‌ను విడుదల చేయనుంది. దీంతో వన్‌ప్లస్ 11 5జీ, వన్‌ప్లస్ 11 ఆర్, వన్‌ప్లస్ బడ్స్ ప్రో, వన్‌ప్లస్ స్మార్ట్ టీవీని కూడా తీసుకువచ్చింది.
ప్యాడ్ టీజర్ ఫొటోను వన్‌ప్లస్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. దాని ప్రకారం చూస్తే.. ట్యాబ్ వెనుక భాగం, ముందు భాగంలో సింగిల్ కెమెరాలు అమర్చింది కంపెనీ. అల్యూమినియం ఫ్రేమ్‌తో ఈ డివైజ్‌ను రూపొందించారట. దీని డిస్‌ప్లే 11.6 అంగుళాలు. ట్యాబ్ కుడివైపు సైడ్‌లో టచ్ సెన్సర్, వాల్యూమ్ కంట్రోల్ బటన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్యాబ్ ధర రూ. 35 వేల నుంచి రూ.40 వేల మధ్య ఉండే అవకాశం ఉంది. ఈ ట్యాబ్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానుంది. వన్‌ప్లస్ 11ఆర్‌లో స్నాప్ డ్రాగన్ 8జెన్ 1+ ప్రాసెసర్, 5జీ వంటి సదుపాయాలున్నాయి.
ఇక వన్‌ప్లస్ 11 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్‌లను తీసుకువస్తోంది. వన్‌ప్లస్ 11ఆర్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1+ ప్రాసెసర్‌ను, వన్‌ప్లస్ 11 5జీలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో 8 జీబీ+128 జీబీ స్టోరేజ్, 16 జీబీ/256 జీబీ వేరియంట్లలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా కెమెరా, డిస్‌ప్లే తదితర వివరాలు తెలియాల్సి ఉంది.
ఇక వన్‌ప్లన్ నార్డ్ స్మార్ట్‌వాచ్‌పై తగ్గింపు అందిస్తోంది. దీని ధర రూ. 4,499 ఉండగా, రూ.500 వరకు తగ్గింపు ఇస్తోంది. అంతేకాకుండా కస్టమర్‌లు ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ. 500 తక్షణ తగ్గింపును పొందవచ్చు . అంతేకాకుండా, MobiKwik Wallet వినియోగదారులు ఈ డీల్‌పై రూ. 500 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి