OnePlus Nord CE 4: మార్కెట్లోకి వచ్చేసిన వన్‌ప్లస్ కొత్త ఫోన్‌.. బడ్జెట్‌ ధరలోనే..

|

Apr 02, 2024 | 6:17 PM

ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్ 14 వెర్షన్‌పై పనిచేస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 100 వాట్స్‌ సూపర్‌ వూక్ ఫాస్ట్...

OnePlus Nord CE 4: మార్కెట్లోకి వచ్చేసిన వన్‌ప్లస్ కొత్త ఫోన్‌.. బడ్జెట్‌ ధరలోనే..
Oneplus Nord Ce 4
Follow us on

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫోన్‌ విడుదలైంది. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం వన్‌ప్లస్ మార్కెట్లోకి ఎట్టకేలకు కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్ నార్డ్‌ సీఈ4 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ స్మార్ట్ ఫోన్‌లో ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్ 14 వెర్షన్‌పై పనిచేస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 100 వాట్స్‌ సూపర్‌ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5500 ఎంఏహెచ్‌ కెపాసిటీగల బ్యాటరీని అందించారు. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

వన్‌ప్లస్ నార్డ్‌ సీఈ4 స్మార్ట్‌ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 93.40 శాతం స్క్రీన్ టూ బాడీ రేషియో ఈ స్క్రీన్‌ సొంతం. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 5జీ, 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.4, జీపీఎస్, గ్లోనాస్, బీడీఎస్, గాలిలియో, యూఎస్బీ టైప్ – సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో తీసుకొచ్చారు.

ఇక ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ను 15 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే రోజంతా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే బ్యాటరీ ఫుల్ ఛార్జ్‌ కావడానికి 29 నిమిషాలు పడుతుంది. ధర విషయానికొస్తే.. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 24,99, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 26,999గా నిర్ణయించారు. ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..